బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న మోడీ పర్యటన హైదరాబాద్‌లో కొనసాగనుంది. అయితే… నేడు రెండో రోజు మోడీ షెడ్యూల్ వివరాలు.. నేటి ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొంటారు. ఈ సమావేశం సాయంత్రం 4:30 వరకూ కొనసాగనుంది. 4.30 నుంచి 5.40 వరకు రిజర్వ్.. సాయంత్రం 6.30 గంటలకు రోడ్డు మార్గంలో మోదీ పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుంటారు.
సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకూ జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీ బస చేస్తారు. రేపు ఉదయం 9.20 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. బేగంపేట్ నుంచి విజయవాడకు మోదీ వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేడు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యోగీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.