రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్రం నిరంతరం కృషి చేస్తోంది : మోడీ

-

గుజరాత్ లోని సబర్ డెయిరీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా చేపట్టిన చర్యలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ఇందుకు తోడ్పడుతోందని చెప్పారు మోదీ. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని మోదీ అన్నారు. వ్యవసాయంతోపాటు పశువులు, చేపల పెంపకం, తేనె వంటి ఇతర కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు మోదీ. ఫలితంగా రైతుల ఆదాయం మరింతగా పెరిగిందని. తాము చేపట్టిన చర్యల ఫలితాలు ఇప్పుడు కనబడుతున్నాయన్నారు మోదీ.

Modi faces a dilemma: Keep voters happy or feed the world | Deccan Herald

పెట్రోల్‌ లో ఇథనాల్‌ కలపడం ద్వారా రైతుల ఆదాయం కూడా పెరిగిందన్నారు మోదీ. అటు కర్బన ఉద్గారాలు తగ్గించడం, ఇటు దిగుమతులపై ఆధారపడడాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపే ప్రక్రియను చేపట్టామని.. దీనిని మరింత పెంచుతామని తెలిపారు మోదీ. ఎనిమిదేళ్ల కిందట పెట్రోల్‌లో 40 కోట్ల లీటర్ల ఇథనాల్‌ కలపగా.. ఇప్పుడది 400 కోట్ల లీటర్లకు పెరిగిందని వివరించారు మోదీ. ప్లాస్టిక్ తో ఉన్న హాని కారణంగా దానిపై నిషేధం విధించామని పేర్కొన్నారు మోదీ.

 

Read more RELATED
Recommended to you

Latest news