ప్రజాస్వామ్యానికి ఇండియా తల్లి లాంటిది – ప్రధాని మోడీ

-

దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర వేడుకల వేదికైన ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని పునరుద్ఘాటించామన్నారు ప్రధాని మోడీ. 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. అమూల్యమైన సామర్థ్యం ఉందని దేశం నిరూపించుకుందని వెల్లడించారు ప్రధాని మోడీ.

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని… 2047 నాటికి 50 ఏళ్లు నిండనున్న యువత, స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్ల నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయాలని కోరారు. “మేము ప్రమాణం చేసినప్పుడు, మేము దానిని నెరవేరుస్తాము. అందుకే నా తొలి ప్రసంగంలో స్వచ్ఛ భారత్‌ గురించి మాట్లాడినప్పుడు ఉద్యమం వచ్చింది’’ . భారత్‌పై ఆశలు ఉన్నాయని, 130 కోట్ల మంది భారతీయుల నైపుణ్యమే అందుకు కారణం అన్నారు ప్రధాని మోడీ

Read more RELATED
Recommended to you

Latest news