నగరంలో మునావర్ ఫరూఖీ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అడ్డుకొంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ షో కోసం ఈ నెల 20న హైదరాబాద్ వస్తున్న స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. 20న ఆయన కామెడీ షో చేస్తే 22న సోషల్ మీడియాలో తన కామెడీ షో స్టార్ట్ అవుతుందన్నారు. సీతారాములపై మునావర్ చాలా నీచంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఫరూకీని కొంతమంది పిలుస్తున్నారని, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తామని చెబుతున్నారని, ఏం కాకుండా చూస్తామని హామీ ఇస్తున్నారని అన్నారు రాజాసింగ్. మరొక్కసారి సీతారాములను తిట్టివెళ్లిపొమ్మని పిలుస్తున్నారని అన్నారు రాజాసింగ్.
ఆయన హైదరాబాద్‌లో అడుగుపెడితే తమ రియాక్షన్ ఏంటో చూస్తారని ఇప్పటికే హెచ్చరించానని అన్నారు రాజాసింగ్. మునావర్ ఏ దేవుడిని మొక్కుతాడో ఆయనపై తాను కూడా కామెంట్స్ చేస్తానంటూ నుపుర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేశారు రాజాసింగ్. ఆయన మొక్కే దేవుడు చిన్న పిల్లను పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడని తాను కూడా కామెంట్ చేస్తానన్నారు. నుపుర్ శర్మ చేసిన చిన్న కామెంట్ దేశం మొత్తం పెద్ద సమస్య అయిందన్నారు. మునావర్ హైదరాబాద్‌లో కాలుపెడితే తన యాక్షన్, రియాక్షన్ చూడాల్సి ఉంటుందని, కాబట్టి అడ్డుకోవాలని డీజీపీ, పోలీస్ కమిషనర్‌లను కోరారు రాజాసింగ్.