BREAKING : పీఎం కిసాన్‌ 12వ విడత సాయం విడుదల

-

భారతదేశంలో అన్నదాతలకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం కింద 12వ విడత సాయాన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది లబ్ధిదారులకు గాను రూ.16వేల కోట్లను అందించనున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం రూ.2.16లక్షల కోట్ల సాయం అందించినట్లు కేంద్ర సర్కార్ వెల్లడించింది.

దిల్లీలోని పుసా క్యాంపస్‌లో ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌ – 2022’ పేరుతో రెండు రోజులపాటు జరుగుతోన్న కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘పీఎం కిసాన్‌’ 12వ విడత ఆర్థిక సాయం విడుదల చేయడంతోపాటు ‘వన్‌ నేషన్‌ వన్‌ ఫర్టిలైజర్‌’ పథకాన్నీ ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 600 పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలను ప్రధాని మోదీ ప్రారంభించారు.

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద దేశంలో అర్హులైన రైతులకు ప్రతి ఏడాది రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసింది. వీటిని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండువేల చొప్పున ఏడాదికి మూడు విడతల్లో అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version