నేడు సుప్రీం ముందుకు ప్రధాని భద్రత వైఫల్యం కేసు… విచారించనున్న త్రిసభ్య ధర్మాసనం

-

పంజాబ్ ఫిరోజ్ పూర్ పర్యటనకు వెళ్తున్న క్రమంలో ప్రధాని మోదీకి భద్రత కల్పించడంలో వైఫల్యం కావడంతో సుప్రీం కోర్ట్ సీరియస్ అయింది. సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ ఇటీవల సుప్రీం కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. ఇది వరకే సుప్రీం కోర్ట్ కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్  పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంసై విచారణకు అన్ని ఏజెన్సీలు సహకరించాలని చెబుతూనే… ప్రధాని పర్యటన వివరాలను భద్ర పరచాలని పంజాబ్, హర్యానా హైకోర్ట్ రిజిస్టార్ ను ఆదేశించింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈరోజు సోమవారం సుప్రీం తిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. ప్రధాని మోదీ భద్రత లోపంపై జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

ఇటీవల పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ పర్యటనకు మోదీ వెళ్లారు. వివిధ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేయడంతో పాటు.. ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే ప్రధాని వెళ్తున్న మార్గంలో ఆందోళనకారులు నిరసన చేపట్టడంతో.. దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ పై ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకుని వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై ఇప్పటికీ.. కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news