వ్యాక్సినేషన్‌ పై ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన !

-

వ్యాక్సినేషన్‌ లో ఇండియా చరిత్ర సృష్టించిందని… అతి తక్కువ కాలంలోనే 100 కోట్ల వ్యాక్సిన్లు అందించామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.  దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ జాతిన ఉద్దేశించి మాట్లాడారు.  ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ… అక్టోబర్‌ 21 వ తేదీ వరకు దేశంలో 100 కోట్ల వ్యాక్సిన్లు వేశామని పేర్కొన్నారు. 100 కోట్ల వ్యాక్సినేషన్‌ మైల్‌ స్టోన్‌ భారత దేశ ప్రజల విజయమని కొనియాడారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు.

భారత విజయాన్ని ప్రపం చ దేశాలు ప్రసంసిస్తున్నాయని స్పష్టం చేశారు. కరోనా పట్ల మన దేశం ఎంత సంకల్ప బద్దంగా ఉంటుందో దానికి ఉదాహారణ ఇదేనన్నారు. సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌ కా వ్యాక్సిన్‌ మన నినాదని.. అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్‌ అందించామని ప్రకటించారు ప్రధాని మోడీ. అతి తక్కువ కాలంలో 100 కోట్ల వ్యాక్సిన్‌ ఇచ్చి… చరిత్ర సృష్టించామన్నారు. ఈ విషయం దేశ ప్రజలు హర్షించ దగ్గ విషయమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version