పోకో నుంచి కొత్త ఫోన్ త్వరలోనే లాంచ్ కానుంది. అదే.. POCO X5 Pro. POCO X5 Pro ఫోన్ ఫిబ్రవరి 6 న లాంచ్ అవుతున్నట్లు సమాచారం.. ఇక ఈ ఫోన్‌తో పాటు POCO X5 కూడా లాంచ్ అవ్వనుందని అంచనా వేస్తున్నారు. POCO X5 Pro ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

POCO X5 Pro ధర..
ఒక లీక్ ప్రకారం, POCO X5 Pro స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర భారత్ లో రూ.21,000 గా ఉంటుందని సమాచారం.
ఇది 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,000 వరకు ఉండవచ్చని అంచనా.. అయితే లాంచ్ తర్వాత ధరల్లో మార్పు ఉండే అవకాశం ఉంది.
POCO X5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
POCO X5 Pro స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వస్తోంది.
ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ వాడినట్లు సమాచారం.
బెస్ట్ గేమింగ్ కోసం ఈ ఫోన్ లో 12 లేయర్ కూలింగ్ సిస్టమ్ ని అందిస్తున్నారు.
ఎక్కువగా గేమింగ్ ఆడే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫోన్ వేడెక్కకుండా ఈ లేయర్ సాయపడుతుంది.
భద్రత కోసం ఈ డివైజ్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇస్తున్నారు.
పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ వంటి ఫీచర్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
కెమెరా సామర్థ్యం
POCO X5 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపీ శాంసంగ్ హెచ్ఎం2 ప్రైమరీ సెన్సర్ వాడినట్లు సమాచారం. దీంతో పాటు 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో లెన్స్ ఉంటాయి. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపీ ఫ్రంట్ కెమెరా అందించారు.