100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు.. ఎందుకంటే..?

-

గతంలో ఏపీలో తిత్లీ తుఫాన్‌ సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. తిత్లీ తుఫాన్‌ ప్రభావంతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరి ఇళ్లు కూడా కూలిపోయి రోడ్డునపడ్డారు. రైతన్నలు పంటలు నష్టపోయారు. ఇలా తిత్లీ తుఫాన్‌ ప్రభావం ఎంతోమంది పడింది. అయితే.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తిత్లీ తుఫాన్‌ బాధితులకు నష్టపరిహారం అందజేస్తోంది. ఈ నేపథ్యంలో.. అర్హులందరికీ తిత్లీ తుపాను పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్‌కు వెళ్లారు.

AP: TDP's membership recruitment drive goes 'paperless'

అయితే, కలెక్టర్‌ను కలిసేందుకు అందరికీ అనుమతి లేదంటూ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అలా అడ్డుకున్న వారిని ఎంతసేపటికీ విడిచిపెట్టకపోవడంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత కార్యకర్తలు లోపలికి వెళ్లారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఎస్సై ప్రవళ్లిక ఫిర్యాదు మేరకు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news