లేరు.. ఇక రారు.. అనుకున్న మావోయిస్టులు వస్తూనే ఉన్నారు. వాళ్ల పని వాళ్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా కేవలం అటవీ ప్రాంతానికే పరిమితం అయిన మావోల ప్రభావం క్రమేనా మైదాన ప్రాంతాలకు విస్తరిస్తుందా? నిజంగా మావోయిస్టులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారా..? దీనికోసం యాక్షన్ టీమ్ లను సిద్ధం చేస్తున్నారా..? అంటే కొట్టి పారేయలేని పరిస్థితి ఉంది. కారణం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ నక్సలైట్ల అలజడి.
ఆదిలాబాద్ జిల్లా బోద్ అడవి ప్రాంతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని కైలాష్ టెక్డీ ప్రాంతంలో నక్సలైట్ల కదలికలు ఉన్నట్టు పోలీసులకు సమాచారంరం అందింది. దీంతో ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో బోద్ సిఐ నైలు నాయక్ కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వారు మావోయిస్టులు అమర్చిన ఓ గ్రానైట్ ను గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకున్నారు. ఏది ఏమైనా బోధ్ ప్రాంతంలో అలజడితో అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏమవుతుందో అని భయపడుతున్నారు.