నాగశౌర్య ఫామ్ హౌస్ లో దొరికిన గుత్తా సుమన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

-

నాగ శౌర్య ఫామ్ హౌస్ లో పేకాట నిర్వ‌హించిన‌ గుత్తా సుమన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గుత్తా సుమన్ చరిత్రను పోలీసులు బయటకు లాగుతున్నారు. హైదరాబాద్ లో పలు ప్రదేశాల్లో సుమన్ జూదం ఆడిస్తున్న‌ట్టు విచార‌ణ‌లో తేలింది. ఇప్పటికే సుమన్ మొబైల్ ను పోలీసులు సీజ్ చేశారు. అతని కాంటాక్ట్స్ లో పలువురు వీఐపీల‌ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ హైదరాబాద్ కు సంబంధించిన బడా వ్యాపారవేత్తలు, ప్రముఖుల ఫోన్ నెంబర్ల‌ను సుమ‌న్ ఫోన్ లో గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలతో పరిచయాలు ఉన్న‌ట్టు గుర్తించారు.

ఎన్జీవో పేరుతో విరాళాలు ఇస్తున్నట్లు బుకాయింపుల‌కు సైతం పాల్ప‌డుతున్నారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే గా భద్రయ్య ప‌నిచేశారు. వాసవి డెవలపర్స్ రాజారాం తో సహా మరో రియల్టర్ మద్దుల ప్రకాష్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. భూకబ్జా కేసులో విజయవాడ నుండి సుమ‌న్ పరారైనట్టు తెలుస్తోంది. విజయవాడ మామిడితోటలో గుత్తా సుమన్ పేకాట క్లబ్బులు నిర్వ‌హించిన‌ట్టు విచార‌ణ‌ల వెల్ల‌డ‌య్యింది. నిన్న దొరికిన కారు నెంబర్ల ఆధారంగా పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version