ఆ విషయంలో రేవంత్ సక్సెస్ అవుతున్నారా?

-

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తుంది. అధ్యక్ష పదవి రాగానే దూకుడుగా రాజకీయం మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. అలాగే తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు వస్తాయని, కేసీఆర్ దగ్గర నుంచి అధికారాన్ని గుంజుకుంటామని రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాగే తెలంగాణలో బిజెపికి అంత సీన్ లేదని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలో వస్తుందని గట్టిగా చెబుతున్నారు.

అలాగే తమ పార్టీని కూడా లైన్ లో పెట్టి, బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తి నేతలని బుజ్జగించారు. ఇంకా ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు. ఇలా అన్ని రకాలుగా ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని తనవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు మొదలెట్టారు.

ఈ క్రమంలోనే సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్‌ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. దీంతోపాటు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ని, భూపాలపల్లి సీనియర్ నాయకుడు గండ్ర సత్యనారాయణని సైతం కాంగ్రెస్‌లోకి తీసుకుంటున్నారు. ఈ ముగ్గురు నాయకులు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. అలాగే చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు.

గతం టిఆర్ఎస్ లో పనిచేసిన కొండా, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఆ తర్వాత కొంచెం పార్టీకి దూరమైన కొండా మళ్ళీ రాజకీయాల వైపు చూడలేదు. అయితే ఈయన బిజెపి లేదా టిఆర్ఎస్‌లో చేరతారని అంతా అనుకున్నారు. కానీ రేవంత్‌కు పిసిసి రావడంతో మళ్లీ ఈయన కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి బలమైన నాయకులని తనవైపుకు తిప్పుకుంటూ, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news