ఫ్యాన్‌ రివర్స్: గుంటూరులో 8 సీట్లు డౌట్ ?

-

ఈ మధ్య వచ్చిన ఏ సర్వే చూసుకున్న ఏపీలో అధికార వైసీపీ హవానే ఎక్కువ ఉందని అంటున్నాయి…ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపీదే అధికారమని చెబుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో టీడీపీ అనుకూల మీడియా పీకే టీం సర్వే అంటూ సరికొత్త కథనాలని తెరపైకి తీసుకొచ్చి వైసీపీని టెన్షన్ పెడుతుంది. ఇప్పటికే సీఎం జగన్…పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు నెక్స్ట్ సీటు ఇవ్వనని చెప్పేశారు.

అయితే పీకే టీం చేసిన సర్వే ఆధారంగానే జగన్…పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నెక్స్ట్ 175కు 175 సీట్లు గెలవాలన్న టార్గెట్ పెట్టుకున్న జగన్ కలలని వైసీపీ ఎమ్మెల్యేలు కల్లలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తాజాగా పీకే టీం సర్వేలో దారుణమైన ఫలితాలు వచ్చాయని టీడీపీ అనుకూల మీడియా కథనం వేసింది. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే…అందులో 75 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదని సర్వేలో తేలిందని చెప్పింది.

వీరికి నెక్స్ట్ సీట్లు ఇస్తే వైసీపీ ఓడిపోవడం గ్యారెంటీ అని పీకే టీం సర్వేలో తేలిందట. అందుకే వీరికి సీట్లు ఇవ్వకూడదని చెప్పినట్లు సమాచారం. ఇందులో దాదాపు 60 మందికి సీట్లు ఇవ్వకూడదని జగన్ డిసైడ్ అయ్యారట…లేదా సీట్లు మార్చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నచోట అదనపు సమన్వయకర్తలని నియమించే ప్రక్రియ చేయపట్టారు. తాజాగా తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగా..అక్కడ సమన్వయకర్తగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ని నియమించారు.

అయితే ప్రతికూల నివేదిక వచ్చిన ఎమ్మెల్యేల్లో గుంటూరు ఎమ్మెల్యేలే ఎక్కువ ఉన్నారు. గుంటూరులో వైసీపీకి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు…ఇందులో 8 మందిపై వ్యతిరేకత ఎక్కువ ఉందని తేలిందట. బాపట్ల, వేమూరు, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, సత్తెనపల్లి, చిలకలూరిపేట, తెనాలి స్థానాల్లోని ఎమ్మెల్యేలకు ప్రతికూల నివేదికలు వచ్చాయని తెలిసింది.. ఇక ఈ స్థానాల్లో అదనపు ఇన్‌చార్జుల నియామకానికి కార్యాచరణ సిద్ధమైందని సమాచారం. మొత్తానికి మరి టీడీపీ అనుకూల మీడియా ఇచ్చిన ఈ కథనంలో ఎంతవరకు నిజముందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news