అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు… బీజేపీ ఓడిపోయే చోట్ల ఈవీఎంలను మార్చారు.

-

మరో రోజు గడిస్తే యూపీలో జెండా ఎగరేసిది ఎవరో తెలుస్తోంది. ఇప్పటికే మెజారిటీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికలు ముగిసినా.. యూపీలో రాజకీయం ముగియలేదు. ఇటు బీజేపీ, అటు ఎస్పీ పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఎన్నికల సంఘం మీద నమ్మకం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓడిపోయే చోట్ల ఎన్నికల సంఘమే ఈవీఎంలను మార్చిందని ఆరోపించారు. కౌంటింగ్ కు ముందే ఈవీఎంలను మార్చారని అన్నారు. స్థానిక అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారణాసి డీఎం ఈవీఎంలను రవాణా చేస్తున్నారని ఆరోపించారు అఖిలేష్. ప్రజాస్వామ్యం కోసం ఇదే చివరి పోరాటమని… ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలుస్తుందనే భావన కల్పించేలా ఉన్నాయని ఆరోపించారు. అయోధ్యలో సమాజ్ వాదీ పార్టీ గెలుస్తుందని ఆయన అన్నారు. అందుకే బీజేపీ భయపడుతోందని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం అధికారులు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని అఖిలేష్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news