కమలంలో కూడా స్టార్ట్..కలిస్తే బెటర్!

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల్లో సొంత పోరు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువ ఉంది. ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో సొంత పోరు ఎక్కువ ఉంది. ఒకో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. అలాగే సీటు దక్కించుకోవడం కోసం ఒకరిపై ఒకరు ఆధిక్యం దక్కించుకునేందుకు చూస్తున్నారు.

అయితే అధికార పార్టీల్లోనే కాదు ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఈ రచ్చ ఉంది…ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ లో కూడా ఆధిపత్య పోరు ఉంది. ఇక తెలంగాణలో అధికారం కోసం పోరాడుతున్న బీజేపీని సైతం ఈ సొంత పోరు సమస్య వదలడం లేదు. తెలంగాణలో బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే…టీఆర్ఎస్ పార్టీకే ధీటుగా బీజేపీ ఎదుగుతుంది. ఇలా ఎదుగుతున్న బీజేపీ లో సైతం సీటు కోసం నేతల మధ్య పోటీ పెరిగింది.

పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య పోటీ ఎక్కువ ఉంది…ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో నేతలు మధ్య పోరు నడుస్తోంది…ఒకో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. ఇక మిగతా జిల్లాల్లోని నియోజకవర్గాల్లో కూడా నేతల మధ్య పోరు కనబడుతోంది. ఇదే క్రమంలో ఆందోల్ నియోజకవర్గంలో బీజేపీ నేతల మధ్య పోటీ ఎక్కువ ఉంది.

ఈ సీటు కోసం సీనియర్ నేత బాబూమోహన్, జెడ్పీ మాజీ ఛైర్మన్ బాలయ్య పోటీ పడుతున్నారు. గతంలో ఆందోల్ నుంచి బాబూమోహన్ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి..ఆయన టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల నుంచి గెలిచారు…అలాగే మంత్రిగా కూడా చేశారు. అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ లో టికెట్ దొరకలేదు..దీంతో బీజేపీలోకి వచ్చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆందోల్ టికెట్ తనదే అన్నట్లు బాబూమోహన్ పనిచేస్తున్నారు…ఇదే సమయంలో టికెట్ రేసులోకి బాలయ్య వచ్చారు. ఇలా రెండు గ్రూపులు నడవటంతో ఆందోల్ లో బీజేపీ శ్రేణులు కన్ఫ్యూజ్ అవుతున్నాయి. కాబట్టి అధిష్టానం త్వరగా ఆందోల్ పంచాయితీని సెట్ చేసి అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే బాగుంటుంది…లేదంటే ఎన్నికల వరకు పంచాయితీ నడిపితే బీజేపీకే నష్టం.

Read more RELATED
Recommended to you

Latest news