టాలీవుడ్‌కు జగనన్న సినిమా…ఆ సినిమాలకు షాక్ తప్పదా?

-

టాలీవుడ్‌కు జగన్ ప్రభుత్వం భారీ సినిమానే చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి సినిమా ఇండస్ట్రీలో కొందరిపై ఉన్న కోపంతో ఇలా చేస్తుందా? లేక నిజంగానే సామాన్యులకు అందుబాటులో ఉండాలని సినిమా టిక్కెట్ల రేట్లని తగ్గించడం చేశారో క్లారిటీ రావడం లేదు. సామాన్యుల కోసమే అనుకుంటే..మిగిలిన ధరలు కూడా తగ్గించాలి..కానీ జగన్ ప్రభుత్వం ఆ పని చేయకుండా, కేవలం సినిమా టిక్కెట్ల రేట్లని తగ్గించింది.

jagan
jagan

దీని వల్ల సినిమాలని ఆడిస్తే తమకు నష్టమే తప్ప… లాభాలు ఉండవని చెప్పి ఓనర్లే స్వయంగా థియేటర్లని మూసివేస్తున్నారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న థియేటర్లపై ప్రభుత్వ అధికారులు రైడ్లు చేస్తున్నారు. ఈ దెబ్బకు కూడా థియేటర్లు మూతపడిపోతున్నాయి. అయితే ఇలాగే పరిస్తితి కొనసాగితే ఏపీలో బడా సినిమాలకు భారీ షాక్ తగలడం ఖాయం.

ఈ క్రమంలోనే కొందరు సినిమా వాళ్ళు… ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై స్పందిస్తున్నారు. గతంలో పవన్, ప్రభుత్వంపై ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక పవన్‌పై వైసీపీ నేతలు ఎలా మాటలు దాడి చేశారో అందరికీ తెలిసిందే. తాజాగా నాని కూడా టిక్కెట్ల రేట్లని తగ్గించడం కరెక్ట్ కాదని మాట్లాడారు…దీంతో ఏపీ మంత్రులు వరుసపెట్టి నానిపై ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేలా లేదన్నట్లు ఏపీ మంత్రులు మాట్లాడుతున్నారు. ఇక ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే టాలీవుడ్‌కు భారీగానే నష్టాలు వచ్చేలా ఉన్నాయి.

ఈ సినిమా టిక్కెట్ల రేట్లతో మనుగడ సాధించడం కష్టమని చెప్పొచ్చు. పైగా సంక్రాంతికి భారీ సినిమాలు వస్తున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’, రాధేశ్యామ్ సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు…కానీ ఏపీలో ఇలాంటి పరిస్తితుల్లో ఆ సినిమాలు రిలిక్ అయితే..భారీగా నష్టాలు రావడం మాత్రం పక్కా.. మరి ఈ సమస్యకు అగ్ర హీరోలు చెక్ పెడతారో లేదో చూడాలి. లేదంటే టాలీవుడ్‌కు జగనన్న సినిమా కనబడటం ఖాయమే.

Read more RELATED
Recommended to you

Latest news