బండి ఎఫెక్ట్..మల్కాజ్‌గిరిలో బీజేపీకి కలిసొస్తుందా?

-

దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి అనే సంగతి అందరికీ తెలిసిందే..అన్నీ ప్రాంతాల ప్రజలు…అన్నీ మతాల ప్రజలు కలిసి ఉండే ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అన్నీ పార్టీలు గట్టిగానే ట్రై చేస్తాయి. అయితే ఏపీ ఓటర్ల ప్రభావం ఎక్కువ ఈ స్థానంలో 2014లో టీడీపీ నుంచి మల్లారెడ్డి గెలిచారు. ఇక తర్వాత ఈయన టీఆర్ఎస్‌లో చేరిపోయారు. 2019 ఎన్నికలు వచ్చేసరికి. ఇక్కడ ఆసక్తికర ఫైట్ నడిచింది. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోటీ చేశారు.

అయితే ఏపీ ఓటర్ల ప్రభావం ఎక్కువ కాబట్టి..వారు రేవంత్ రెడ్డికి ఎక్కువ మద్ధతుగా నిలబడ్డారు. దీంతో 10 వేల ఓట్ల మెజారిటీతో రేవంత్ గెలిచారు. కొడంగల్‌లో ఓడిపోయిన సరే మల్కాజిగిరిలో సత్తా చాటారు. మరి ఈ సారి ఎన్నికల్లో ఇక్కడ రాజకీయం ఎలా ఉండబోతుంది..ఇక్కడ పోటీ ఎవరు మధ్య ఉంది అనే విషయాన్ని ఒక్కసారి చూస్తే..ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో బీజేపీ బలం పెరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే బండి సంజయ్ సైతం..మల్కాజిగిరి పార్లమెంట్ ప్రాంతలో పాదయాత్ర చేస్తున్నారు. దీంతో ఇక్కడ బీజేపీకి ఆదరణ పెరుగుతూ వస్తుంది.

గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి రామచందర్ రావు పోటీ చేసి..దాదాపు 3 లక్షలు పైనే ఓట్లు తెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్-బీజేపీల మధ్య ఫైట్ నడిచేలా ఉంది. ఇక ప్రస్తుతం ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి…మళ్ళీ కొడంగల్‌ బరిలో ఉండొచ్చు. ఒకవేళ రేవంత్ అటు వెళితే ఇక్కడ కాంగ్రెస్ వీక్ అవుతుంది. దీంతో టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ నడుస్తోంది. రెండు పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది చూడాలి.

అదే సమయంలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో కూడా మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచేలా ఉంది. అయితే కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉప్పల్ సీట్లపై బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. మరి చూడాలి మల్కాజిగిరీలో బీజేపీ ఎంతవరకు సత్తా చాటుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news