మునుగోడులో కారుకు ‘బీసీ’ షాక్..!

-

దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎలాగో బీజేపీ చేతిలో దెబ్బతిన్నారు..కానీ మునుగోడులో మాత్రం దెబ్బకొట్టాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ గట్టిగానే ట్రై చేస్తుంది. బీజేపీకి ఈ సారి ఖచ్చితంగా చెక్ పెట్టాలని టీఆర్ఎస్ కసితో పనిచేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఉపఎన్నికలో గెలవగలితేనే..అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటగలమని టీఆర్ఎస్ భావిస్తుంది. ఎట్టి పరిస్తితుల్లోనూ బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదని అనుకుంటుంది.

అటు బీజేపీ సైతం ఇక్కడ దూకుడుగా ముందుకెళుతుంది..మునుగోడుని కూడా కైవసం చేసుకోవాలని చూస్తుంది. అలాగే కాంగ్రెస్ సైతం ఈ సారైనా గెలిచి తీరాలనే కసితో పనిచేస్తుంది. ఇలా మునుగోడులో ట్రైయాంగిల్ ఫైట్ నడుస్తోంది. అయితే మునుగోడులో ప్రతి పార్టీలోనూ ఏదొక రచ్చ జరుగుతుంది. అలాగే అధికార టీఆర్ఎస్ లో సైతం..అభ్యర్ధి విషయంలో నేతల మధ్య వార్ నడుస్తోంది. ఈ సీటుని మరొకసారి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇవ్వాలని కేసీఆర్ దాదాపు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

అందుకు తగ్గట్టుగానే మంత్రి జగదీశ్ రెడ్డి..కూసుకుంట్లని వెంటబెట్టుకుని నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. అంటే దాదాపు కూసుకుంట్లకు సీటు ఫిక్స్. కానీ అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. ఇదే క్రమంలో సీటు కోసం నియోజకవర్గంలో బీసీ నేతలు గట్టిగా ట్రై చేస్తున్నారు. కర్నే ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్, నారాబోయిన రవి…ఇలా బీసీ నేతలు సీటు ఆశిస్తున్నారు. కానీ టీఆర్ఎస్ అధిష్టానం కూసుకుంట్ల వైపు ఉంది. పైగా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఈ బీసీ నేతలు కనిపించడం లేదు.

మరి వీరికి ఆహ్వానం అందడం లేదు..లేక వీరు వెళ్ళడం లేదో తెలియదు గాని..బీసీ నేతలు మాత్రం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సైతం..మంత్రి జగదీశ్ ఒంటెద్దు పోకడలతో ముందుకెళుతున్నారని, ఎవరిని కలుపుకోవడం లేదని విమర్శించారు. దీని బట్టి చూస్తే బీసీ నేతలని సైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలే నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువ. ఈ క్రమంలో బీసీ నేతలు యాంటీ అయితే టీఆర్ఎస్ పార్టీకే ప్రమాదం. అందుకే బీసీ నేతలతో త్వరలోనే కేసీఆర్ సమావేశమై…వారిని సముదాయిస్తారని తెలుస్తోంది. లేదంటే మునుగోడులో కారుకు బీసీలే చెక్ పెట్టేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news