గులాబీ బాస్ ఎంట్రీ అప్పుడేనా..? సీనియర్ నేతలకు కేసీయార్ చెబుతున్నదేంటి..?

-

ఆ నేత చుట్టూ తెలంగాణా రాజకీయాల్లో లోతైన చర్చలు నడుస్తున్నాయి.. ఆయన లేని లోటు పార్టీలో కనిపిస్తుందని స్వంత పార్టీ నేతలు చెబుతుంటే.. భయపడి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.. కానీ ఆయన మాత్రం యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు.. ఇంతకీ ఎవరా మాజీ సీఎం..? ఆయన ఎప్పుడు జనాల్లోకి రాబోతున్నారు..? ఆ పార్టీలో జరుగుతున్న చర్చంటి..? ఇలాంటి ఇంట్రస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరకాలంటే ఈ కథనం చూడాల్సిందే..

తెలంగాణ రాజకీయాల్లో మాజీ సీఎం కేసీయార్ సీనియర్ నాయకులు.. రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట.. పదేళ్ల పాటు అధికారాన్ని ఏలిన ఆయన.. ఓడిపోగానే.. ఫామ్ హౌస్ కు పరిమితయ్యారు.. ఆ మధ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓ రోజు సభకు హాజరయ్యారు అంతే. అప్పటి నుంచి బయటికి రాలేదు.. సీనియర్ నేతలతో మాట్లాడాలంటే ఫామ్ హౌస్ కు పిలిపించుకుంటున్నారుతప్పా.. ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ కూడా చెయ్యడం లేదు..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నువ్వా నేనా అన్నట్లు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది.. రైతు రుణమాఫీ, హైడ్రా మంటలు.. మూసీ ప్రక్షాళన, అవి కాకుండా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వంటి కాంట్రవర్సీలు జరిగినా.. ఆయన ఎక్కడా బయటికి వచ్చి నోరుమెదపలేదు.. అంతేకాదు ఆ మధ్యం తెలంగాణలో భారీ వరదలు ముంచేత్తిన సమయంలోనూ కేసీఆర్‌ జనం మధ్యకు రాలేదు. వీటన్నింటికి మీద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌ రావులు మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు..

కేసీయార్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడంపై మంత్రులు తీవ్రమైన విమర్శలు చేస్తున్నా.. ఆయన పట్టించుకోవడంలేదు.. తెలంగాణ రాజకీయాల్లో అనేక వివాదాలు జరుగుతున్నా.. ఆయన రియాక్ట్ అవ్వకపోవడానికి అనేక కారణాలున్నాయని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.. ఆరోగ్యం సరిగాలేకపోవడం ఒకటైతే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.. కనీసం ఏడాదైనా టైమ్ ఇచ్చి.. ఆ తర్వాత జనాల్లోకి వెళ్తే మైలేజ్ వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారట.. ఈలోపు కాంగ్రెస్ పార్టీ వల్ల మంచి జరిగిందో.. లేక చెడు జరిగిందో జనాలకు అర్దమవుతుందని.. ఆ తర్వాత ప్రభుత్వంపై పోరాటాలు చేస్తే పార్టీకి పుంజుకుంటుందని కేసీఆర్ ఆలోచనగా ఉందట.. ఇదే విషయాన్ని ఆయన్ని కలుస్తున్న నేతలకు కేసీయార్ చెబుతున్నారని టాక్ వినిపిస్తోంది.. దీన్ని బట్టి చూస్తే మరో నెల లేదా రెండు నెలల్లో గులాబీ బాస్ బయటికి రాబోతున్నారన్నమాట..

Read more RELATED
Recommended to you

Exit mobile version