పినపాకలో కారుకు డ్యామేజ్… రేగాకు నో ఛాన్స్!

-

అసలే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి పెద్దగా పట్టు లేదు…అక్కడ ప్రజలు ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీని పెద్దగా ఆదరించలేదు…తెలంగాణ వచ్చాక జరిగిన 2014, 2018 ఎన్నికల్లో సైతం రాష్ట్రంలో టీఆర్ఎస్ హవా ఉన్నా సరే..ఖమ్మంలో మాత్రం కారు చతికలపడింది. గత ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వచ్చాయి. మొత్తం 10 సీట్లు ఉంటే..ఒక సీటు మాత్రమే కారు పార్టీ గెలిచింది.

అయితే అధికారంలోకి రావడంతో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా నలుగురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని కారు ఎక్కించుకున్నారు. కానీ ఎమ్మెల్యేలని అయితే లాక్కున్నారు గాని..ప్రజా బలం మాత్రం పెంచుకోలేదు..పైగా జంపింగ్ ఎమ్మెల్యేల వల్ల టీఆర్ఎస్ బలపడటం పక్కన పెడితే…ఇంకా బలహీన పడింది…అలాగే జంపింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని తెలుస్తోంది.

అందులో ముఖ్యంగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుపై ప్రజా వ్యతిరేకత ఎక్కువే కనిపిస్తోంది..2009లో ఈయన కాంగ్రెస్ నుంచి గెలిచారు…ఇక 2014లో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి జంప్ చేశారు. అధికార పార్టీలోకి వచ్చాక ఈయన ప్రజలకు పని చేసి పెట్టడం కంటే సొంత పనులు చేసుకోవడంలో ఎక్కువ బిజీగా ఉన్నారని తెలిసింది. అలాగే పినపాకలో దందాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు…ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అక్రమాలు జరుగుతున్నాయని కథనాలు వస్తున్నాయి. ఈ పరిణామాలు ఎమ్మెల్యే రేగాకు మైనస్ అవుతున్నాయి.

పైగా పినపాక టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు ఎక్కువగా ఉంది…2018లో రేగాపై ఓడిపోయిన పాయం వెంకటేశ్వర్లు..సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు..అలాగే ఈయన సీటు కోసం పోటీ పడుతున్నారు…ఒకవేళ సీటు గాని రేగాకు ఇస్తే సహకరించే పరిస్తితి లేదు..లేదంటే పార్టీ మారిపోయే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఎటు చూసిన రేగాకు నెగిటివ్ ఎక్కువ కనిపిస్తోంది…పినపాకలో ఉన్న రాజకీయ పరిస్తితులని చూస్తుంటే నెక్స్ట్ ఎన్నికల్లో రేగాకు మళ్ళీ గెలుపు కష్టమే అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news