కారు దోస్తీ..కమలంతోనా..కాంగ్రెస్‌తోనా?

-

తెలంగాణలో అధికారంలో కేసీఆర్…భవిష్యత్‌లో కేంద్రంలో కూడా చక్రం తిప్పాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో తాము అనుకున్న విధంగా ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలని కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లోనే కేసీఆర్ ఈ రకమైన రాజకీయాలు చేశారు. అందుకే ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లారు. ముందస్తు ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచేసి అధికారంలోకి వచ్చి, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి కేంద్రంలో చక్రం తిప్పాలని చూశారు.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

కానీ కేంద్రంలో రెండోసారి కూడా బీజేపీ మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో కేసీఆర్ అనుకున్నది సాధ్యం కాలేదు. కాకపోతే ఈ సారి కేంద్రంలో బీజేపీకి అంత అనుకూల వాతావరణం కనబడటం లేదు. అలా అని మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రతిపక్షాలు ప్రయత్నించడం లేదు. కాంగ్రెస్‌తో కలిసే, బీజేపీని ఎదురుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి.

మరి ఇలాంటి పరిస్తితుల్లో కేసీఆర్…బీజేపీకి సపోర్ట్ ఇస్తారా? లేక కాంగ్రెస్‌కు సపోర్ట్ ఇస్తారా? అనే అంశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలతో కేసీఆర్ పోరాడుతున్నారు. ఆ రెండు పార్టీలు కూడా కేసీఆర్‌ని ప్రత్యర్ధిగా చూస్తున్నాయి. కానీ కేంద్రంలో మాత్రం పరిస్తితి వేరుగా ఉంది. కేసీఆర్ ఖచ్చితంగా ఒక పార్టీ వైపుకు వెళ్లాల్సిన పరిస్తితి కనిపిస్తోంది. తాజాగా కూడా కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్, ప్రతిపక్ష పార్టీలతో ఏర్పాటు చేసిన విందులో టీఆర్ఎస్ కూడా పాల్గొందని నేషనల్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.  అలా అని కేసీఆర్‌ కాంగ్రెస్‌తో ముందుకెళ్తారనే విషయాన్ని ఇప్పుడే కన్ఫామ్ చేయడం కష్టం.

ఎందుకంటే రాష్ట్రంలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ఏ విధంగా కేసీఆర్‌పై పోరాటం చేస్తుందో అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్తితులని బట్టి చూస్తే కేసీఆర్, కేంద్రంలో న్యూట్రల్‌గా ఉండాల్సిన పరిస్తితి ఉంది. కానీ రాష్ట్ర ప్రయోజనాలని నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా అప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్న పార్టీలకు కేసీఆర్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరి కేంద్రంలో కేసీఆర్ దోస్తీ ఎవరితో ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news