జగన్ కి గుడ్ న్యూస్; మండలి రద్డుకి కేంద్రం ఓకే…!

-

రెండు నెలల్లో మండలి రద్దు బిల్లు కేంద్రం వద్ద ఆమోదం పొందుతుందా…? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. వాస్తవానికి మండలి రద్దు చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. దీనికి కేంద్రం నుంచి మద్దతు ఉంటే తప్ప జగన్ తనంతట తానుగా ఏది చేసే అవకాశం ఉండదు. సభలో ఆమోదం పొందితేనే మండలి రద్దు అవుతుంది. రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తేనే శాసనమండలి అధికారికంగా పూర్తయినట్లు.

అప్పటివరకు శాసనమండలిలో చట్టాలు పెండింగ్లోనే ఉన్నాయి. అయితే ఇక్కడ కేంద్రం నుంచి జగన్ పూర్తి సహకారం ఉందని రాజధాని మార్పుని కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా కోరుతుందని, అయితే అనూహ్యంగా మండలిలో ఎదురు దెబ్బ తగలడంతో కేంద్రం కూడా షాక్ అయిందని అంటున్నారు. దీనితో గత వారం రోజుల నుంచి జగన్ కేంద్రంతో సంప్రదింపులు జరిపే మండలి రద్దు నిర్ణయం అధికారికంగా ప్రకటించారట.

ఆ తర్వాత క్యాబినెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాలని భావించారట. మరో రెండు రాష్ట్రాల మండలి రద్దు బిల్లును ఆమోదించి కేంద్రం వద్దకు పంపగా అక్కడ అవి పెండింగ్లో ఉన్నాయి. వాటితోపాటుగా దీనిని కూడా ఆమోదించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. మూడు కలిపి ఒక సారి కేంద్రం చేస్తుందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద కేంద్రం ఇప్పటికే గుర్రుగా ఉంది.

దీనితో జగన్ నిర్ణయాలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతుందని అటు వైసిపి వర్గాలు కూడా అంటున్నాయి. దీంతో దాదాపు రెండు మూడు నెలల్లోనే మండలి రద్దు ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ ధైర్యంతోనే జగన్ ముందడుగు వేశారని అంటున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మండలి రద్దు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news