ఢిల్లీలో బాబు పంచాయితీ… అంతా అస్సామేనా?

ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. సీఎంగా ఉన్నప్పుడు ప్రతిసారి ఢిల్లీలో కనిపించేవారు..కానీ ప్రతిపక్షంలోకి వచ్చాక పెద్దగా ఢిల్లీకి వెళ్ళే పని పడలేదు. కానీ తాజాగా రాష్ట్రంలో జరిగిన ఘటనల నేపథ్యంలో బాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణుల దాడుల నేపథ్యంలో బాబు 36 గంటల దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఆ దీక్ష ఎలాగో ఎత్తిపోయింది…ఈ క్రమంలోనే రాష్ట్రపతిని కలవడానికి ఢిల్లీ వచ్చారు. అలాగే రాష్ట్రంలోని పరిస్తితులని బాబు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

Nara-Chandrababu-Naidu
Nara-Chandrababu-Naidu

ఏపీలో ఆర్టికల్ 356ను అమలు చేయాలని, దాడుల ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని, ఏపీలో గంజాయి, హెరాయిన్లపై చర్యలు తీసుకోవాలని, డీజీపీని రీకాల్ చేయాలని, చేసిన తప్పులకు శిక్షపడాలని చంద్రబాబు 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతికి ఇచ్చినట్లు చెప్పారు. ఇక రాష్ట్రపతిని కలిసొచ్చాక యథావిధిగానే చంద్రబాబు…మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఢిల్లీకి వెళ్ళినా సరే అదే లొల్లి అన్నట్లుగా…జగన్, డీజీపీలపై విమర్శలు చేశారు.

సరే చంద్రబాబు ఫిర్యాదు చేశారు బాగానే ఉంది…మరి వాటిపై చర్యలు తీసుకోవడం అనేది అంత సులువుగా జరుగుతుందా? రాష్ట్రపతి పాలన పెడతారా? అంటే అదంతా అసాధ్యమనే చెప్పాలి. కాబట్టి బాబు ఏదో ఢిల్లీకి వెళ్ళి కాస్త హైలైట్ అవ్వాలని అనుకున్నట్లు కనిపిస్తోంది. కానీ హైలైట్ అవ్వడం కూడా జరిగినట్లు కనబడటం లేదు…ఏపీ ప్రజలు బాబు ఢిల్లీ పర్యటనని బాగా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

అంటే ఏపీ ప్రజల దృష్టిలో కూడా బాబు పడలేదు. పైగా అనుకూల మీడియా బాగా హైలైట్ చేయాలని చూసింది…ఢిల్లీలో బాబు సింహా గర్జన…ఉగ్రరూపం అని టైటిల్స్ పెట్టి హడావిడి చేసినా అంతా అస్సామే అయినట్లు ఉంది. ఇక తర్వాత అమిత్ షా, మోడీలని కలవాలని బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. కలిసి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది..మరి బాబు ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి.