టీ-పాలిటిక్స్: బాబు రీఎంట్రీ..సెట్ చేస్తారా?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే చాలాకాలం అయిపోయింది…అసలు తెలంగాణలో టీడీపీకి ఉనికి లేదు. ఏదో పేరుకు మాత్రమే పార్టీ ఉంది…అలాగే కొందరు నాయకులు ఉన్నారు తప్ప..తెలంగాణ రాజకీయాల్లో టీడీపీకి పెద్ద స్కోప్ లేదని చెప్పొచ్చు. అయితే గతంలో తెలంగాణలో ఎంత స్ట్రాంగ్ అనేది అందరికీ తెలిసిందే..కానీ రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో టీడీపీ బాగా నష్టపోయింది..2014 ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. ఇక 2018 ఎన్నికల తర్వాత ఉన్న నేతలు కూడా వేరే పార్టీల్లోకి జంప్ చేశారు. దీంతో తెలంగాణలో టీడీపీ ఉనికి లేకుండా పోయింది.

కాకపోతే తెలంగాణ టీడీపీ శాఖకు ఓ అధ్యక్షుడు, కొందరు నేతలు ఉన్నారు. ఇక వారు అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప..పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. అటు అధినేత చంద్రబాబు సైతం పూర్తిగా ఏపీకి పరిమితమయ్యారు…పైగా అక్కడ ప్రతిపక్షంలో ఉండటంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు బాబు దృష్టి మొత్తం ఏపీలో అధికారంలోకి రావడంపైనే పెట్టారు. దీంతో తెలంగాణని వదిలేశారు.

ఇక బాబు ఉండేది హైదరాబాద్ లోనే…అక్కడ నుంచి ఏపీకి వెళ్ళి రాజకీయం చేస్తున్నారు. అసలు హైదరాబాద్ లో ఉండి కూడా ఆయన తెలంగాణ రాజకీయాలని పట్టించుకోవడం లేదు. అయితే త్వరలోనే బాబు..ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 24న చింతకాని మండలం పాతర్లపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే బాబు విగ్రహావిష్కరణతోనే ఆగిపోతారా? లేక రాజకీయంగా ఖమ్మం జిల్లాలో ఏవైనా కార్యక్రమాలు చేస్తారా? నేతలతో సమావేశం అవుతారా ? అనేది క్లారిటీ లేదు.

అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో బాబు తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం ఏ మాత్రం లేదని చెప్పొచ్చు…ఏదో అతిథిగా వచ్చి విగ్రహ ఆవిష్కరణ చేయడం తప్ప…రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలు చేసే అవకాశాలు కూడా కనిపించడం లేదు. చూడాలి మరి బాబు..ఖమ్మం పర్యటన ఎలా నడుస్తుందో?