ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ మద్యం విషయంలో ఇప్పుడుచాలా సీరియస్ గా ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఆయన అక్రమ మద్యం విషయంలో ఇటీవల కొందరు నేతల మీద జగన్ నేరుగానే సీరియస్ అయ్యారు. ఇక ఇప్పుడు అక్రమ మద్యం విషయంలో ఆయన కీలక సూచనలు డీజీపీ కి చేసినట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణా సరిహద్దుల్లో కొందరు నేతలు ఏపీకి మద్యం తరలిస్తున్నారు అని నిఘా వర్గాలు గుర్తించాయి.
దీనికి సంబంధించిన సమాచారం జగన్ వద్ద పూర్తి స్థాయిలో ఉంది. దీనిపై జగన్ ఇప్పటికే పలు సూచనలను కొందరు నేతలకు చేయడమే కాకుండా తెలంగాణా ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్న ఒక కీలక నేతకు పూర్తి స్థాయిలో హెచ్చరికలు కూడా చేసినట్టు తెలుస్తుంది. అయినా సరే అక్రమ మద్యం విషయంలో సదరు నేత ఎక్కడా ఆగకపోవడం తో జగన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు అని సమాచారం. ఎవరు అయితే అక్రమ మద్యం తెలంగాణా నుంచి ఏపీ తీసుకొస్తున్నారు వాళ్ళ అందరి జాబితాను జగన్ సిద్దం చేసారు.
వీరిలో కొందరి విషయంలో రెడ్ మార్క్ కూడా చేసి ఉంచారు అని సమాచారం. త్వరలోనే వరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. అదే విధంగా తెలంగాణలో ఉన్న నేతలతో ఇసుక వ్యాపారాలు చేసే వాళ్ళను, బిజెపి నేతలకు సహకరించే వారిని ఆయన గుర్తించారు అని తెలుస్తుంది. త్వరలోనే వారి మీద ఆయన చర్యలకు దిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఎవరిని కూడా మద్యం విషయంలో క్షమించేది లేదు అని జగన్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.