ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ… మంత్రులకు ప్రియతమ నేత భరోసా

-

అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాది సమయం ఉండగానే.. ముందస్తు ఊహగానాలు మొదలయ్యాయి. వైసీపీ అధినేత సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళతారంటూ చర్చ జోరందుకుంది. ఎప్పటికప్పుడు దీనిని మంత్రులు ఖండిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు నానా హడావుడి చేసేస్తున్నాయి. ముందస్తు పై ప్రజల్లోకి సంకేతాలు పంపిస్తూ అభ్యర్థుల ఖరారు, పార్టీలతో పొత్తులు వంటి అంశాలతో హడావుడిగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సన్నాహాలను మొదలుపెట్టి మేనిఫెస్టోలను విడుదల చేశాయి. దీంతో ఏపీలో ముందస్తా..?

లేక షెడ్యుల్‌ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా..? అనేది అటు పొలికల్‌ వర్గాల్లో.. ఇటు జనంలో కూడా హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ముందస్తు ఎన్నికలపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు. బుధవారం మంత్రులతో కేబినెట్ మీట్ నిర్వహించి అనేక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో సీఎం ముందస్తు ఎన్నికలపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చేసారు.

కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్‌ కేబినెట్‌ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. షెడ్యూల్‌ ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని మంత్రులకు సీఎం స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. ముందస్తు ఉండదని మంత్రులందరికీ క్లియర్‌గా చెప్పినట్టు సమాచారం.

ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల టైముందని, ఈ సమయమంతా బాగా కష్టపడితే గెలుపు మళ్ళీ వైసీపీ దేనని మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది. ఈ తొమ్మిది నెలలు కష్టపడాలని.. మిగిలిన సంగతి తాను చూసుకుంటానని మంత్రులకు జగన్‌ భరోసా ఇచ్చినట్టు సమాచారం.

అయితే ఏపీ కేబినెట్‌ సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (CPS) ను రద్దు చేయడంతోపాటు.. దాని స్థానంలో కొత్తగా గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (GPS) ను అందుబాటులోకి తీసుకుచ్చేందుకు తీర్మానించారు. మొదటి నుంచి ఉద్యోగ సంఘాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాదు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేయాలని కోరుతున్నాయి. మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగ సంఘాల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news