అటు ప్రధాని మోదీ తెలంగాణలో ఎంట్రీ ఇచ్చారు..ఇటు సీఎం కేసీఆర్ ఓ రేంజ్ లో మోదీపై విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్-బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తారస్థాయిలో నడుస్తోంది. ఇక ఎప్పుడైతే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించడానికి ఫిక్స్ అయ్యారో..అప్పటినుంచి రెండు పార్టీల మధ్య మరింత ముదిరింది.
ఇక ఓ వైపు సమావేశాల కోసం మోదీ హైదరాబాద్ లో ఎంట్రీ ఇవ్వడం..మరో వైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కు కేసీఆర్ భారీ స్థాయిలో స్వాగతం చెప్పారు.. అలాగే జలవిహార్ లో జరిగిన యశ్వంత్ సిన్హా ప్రచార సభలో కేసీఆర్…మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ వల్ల దేశం తిరోగమనంలో నడుస్తుందనే విధంగా విమర్శలు చేశారు..మోదీ వల్ల పెద్ద పెద్ద కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయని, ఇక దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని కూల్చాలని కేసీఆర్.మోదీకి సవాల్ చేశారు.
ఇక తాము ఢిల్లీలో మీ ప్రభుత్వాన్ని కూల్చుతామని, మీరు ఎంత అవినీతి చేశారో, మీ స్నేహితులైన వ్యాపారులకు.ఎంత దోచి పెట్టారో తమ దగ్గర లెక్కలున్నాయని, బీజేపీ అవినీతి చిట్టా త్వరలోనే బయటపెడతామని కేసీఆర్ ఫైర్ అయ్యారు. అటు బీజేపీ నేతలు సైతం కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు.
ఓ వైపు కార్యవర్గ సమావేశాలు జరుగుతుండగానే…బీజేపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఫైర్ అవుతున్నారు. ఇక ఆదివారం జరిగే విజయ్ సంకల్ప్ సభలో మోదీ..ఏ స్థాయిలో కేసీఆర్ పై ఫైర్ అవుతారో చూడాలి. అయితే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీజేపీ…కేంద్రంలో మోదీ సర్కార్ ని కూలుస్తామని కేసీఆర్ ఛాలెంజ్ చేసుకుంటున్నారు. ఇక ఈ సవాళ్లలో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి. కాకపోతే తెలంగాణలో కేసీఆర్ కు చెక్ పెట్టడం అనేది సులువు కాదు…అదే సమయంలో కేంద్రంలో మోదీ సర్కార్ ని కూల్చడం కూడా సాధ్యమైన పని కాదు. మరి ఈ కూల్చే వ్యవహారంలో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.