ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో మరణించిన సైనికులకు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో, ముఖ్యమంత్రి కేసీఆర్ తన అభిప్రాయాలు వ్యక్తంచేశారు. ఇండో-చైనా సరిహద్దులో జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భారత-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు వ్యుహాత్మకంగా వ్యవహరించాలని ప్రధానికి సూచించారు. దేశంలో రాజకీయాలు పక్కనబెట్టి యుద్ధనీతితో ఆలోచించాలన్నారు.
ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదు.. యుద్ధనీతి : సీఎం కేసీఆర్
-