పాలమూరు కాంగ్రెస్‌లో సీటు చిచ్చు..చెక్ ఎవరికి?

-

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట..కానీ అలాంటి చోట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్తితి దారుణంగా తయారైంది..గత రెండు ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడింది. గత రెండు ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ హవా నడిచింది. అయితే ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తుంది…కానీ బి‌ఆర్‌ఎస్ ఆధిక్యం ఉండటం..అటు బి‌జే‌పి బలపడటంతో ఈ సారి పాలమూరులో త్రిముఖ పోరు జరిగేలా ఉంది.

కొన్ని స్థానాల్లోనే కాంగ్రెస్ బలం కనిపిస్తుంది..దీంతో కొన్ని స్థానాల్లో బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య ఫైట్ జరిగే ఛాన్స్ ఉండగా, కొన్ని చోట్ల బి‌జే‌పి-బి‌ఆర్‌ఎస్ పార్టీల మధ్య పోరు జరగనుంది. అయితే జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సీటు విషయంలో విభేదాలు పెరిగాయి. కొన్ని సీట్లలో నేతలు మధ్య పోరు నడుస్తోంది. కొల్లాపూర్ స్థానంలో జగదీశ్వరరావు, అభిలాషరావుల మధ్య పోరు నడుస్తోంది. ఎవరికి వారు కొల్లాపూర్ సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు.

అటు జడ్చర్లలో ఎర్రశేఖర్, అనిరుధ్ రెడ్డిల మధ్య పోరు ఉంది. ఇందులో శేఖర్..రేవంత్ రెడ్డి వర్గం కాగా, అనిరుధ్..కోమటిరెడ్డి వర్గం. ఇక ఎవరికి వారు జడ్చర్ల సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వనపర్తిలో సీనియర్ నేత చిన్నారెడ్డి ఉండగా..ఆయనకు పోటీగా శివసేన రెడ్డి పనిచేస్తున్నారు. ఇక్కడ ఎవరికి వారు సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. అటు నాగర్ కర్నూలు స్థానంలో సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఉన్నారు..కానీ ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదు. దీంతో ఆయన తనయుడు శశిధర్ రెడ్డి యాక్టివ్ గా ఉన్నారు.

ఇటు నారాయణపేటలో కుంభం శివకుమార్ రెడ్డి ఉండగా..ఆయన ఆల్రెడీ సీటు కోసం ట్రై చేస్తున్నారు. కానీ ఆయన మేనల్లుడు అభిజయ్ రెడ్డి సైతం సీటు కోసం చూస్తున్నారు.  మక్తల్లో శ్రీహరి, ప్రశాంత్ రెడ్డిల మధ్య సీటు ఫైట్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news