ధర్మాన..జగన్‌ని ఇరికిస్తున్నారా?

-

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ధర్మాన ప్రసాదరావుకు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. దశాబ్దాల కాలం నుంచి ధర్మాన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో అనేక ఏళ్ళు పనిచేశారు..ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి వైసీపీలోకి వచ్చారు. ఇక 2014లో శ్రీకాకుళం అసెంబ్లీలో ఓడిపోగా, 2019 ఎన్నికల్లో గెలిచారు. మొదట విడతలో ధర్మాన సోదరుడు కృష్ణదాస్‌కు మంత్రి పదవి రాగా, రెండో విడతలో ధర్మానకు మంత్రి పదవి వచ్చింది.

ఇక ఈయన మంత్రిగా ఏం చేస్తున్నారో ప్రజలకు క్లారిటీ లేదు గాని..ఈయన పదే పదే విశాఖని రాజధానిగా చేయాలనే డిమాండ్ మాత్రం చేస్తూ ఉంటారు. ఇప్పటికే సీఎం జగన్ మూడు రాజధానుల్లో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానని ప్రకటించారు. దీంతో విశాఖని రాజధాని కోసం ధర్మాన పాకులాడుతున్నారు. అమరావతి రాజధాని అంటున్న చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందని, విశాఖ రాజధాని అయితే బాగుపడతామని అంటారు.

అయితే ఇన్నేళ్లు ధర్మాన ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారు..మరి ఉత్తరాంధ్రని ఎందుకు అభివృద్ధి చేయలేదంటే సమాధానం ఉండదని విమర్శలు ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే..ధర్మాన అప్పుడప్పుడు ట్విస్ట్ లు ఇస్తున్నారు. దాని వల్ల జగన్‌కు మేలు చేస్తున్నారో కీడు చేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది. ఆ మధ్య పేరుకే మూడు రాజధానులు అని, విశాఖనే అసలు రాజధాని అని బాంబు పేల్చారు.

ఎలాగోలా మూడు రాజధానులని కవర్ చేస్తే పర్లేదు..విశాఖని మెయిన్ అని చెప్పి..ఇతర ప్రాంతాలు ఆలోచించేలా చేశారు. అది వదిలేస్తే తాజాగా మరో బాంబు పేల్చారు..త్వరగా విశాఖని రాజధాని చేయాలని..ఉత్తరాంధ్రని సెపరేట్ రాష్ట్రంగా చేసి విశాఖ రాజధానిగా చేయాలని అంటున్నారు. ఇది సాధ్యమయ్యే డిమాండ్ కాదు.కానీ ధర్మాన ఇలా బాంబు పేల్చి..ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. దీనిలో ఏమైనా రాజకీయం ఉందా? అసలు దీని వల్ల జగన్‌కు లాభం ఉంటుందో లేదో క్లారిటీ లేదు. ఏదేమైనా ధర్మాన రాజకీయం మామూలుగా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news