ఎడిట్ నోట్ : పెద్ద‌ల స‌భ‌కు ఆ ఇద్ద‌రూ .. !

-

పెద్ద‌ల స‌భ‌కు సంబంధించి ఆంధ్రావ‌ని త‌రుఫున ఇద్ద‌రు మాత్ర‌మే వెళ్లనున్నారు. ఆ మేర‌కు జగ‌న్ తీసుకున్న నిర్ణ‌యంలో భాగంగా వైసీపీకి అక్క‌డ ద‌క్కే ప్రాధాన్యం నాలుగు సీట్లున్నా, రెండు తెలంగాణ‌కు రెండు ఆంధ్రాకు కేటాయించ‌డం విశేషం. ఈ త‌రుణంలో కొన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా, ఇప్ప‌టికిప్పుడు ఆయ‌న నిర్ణ‌యంలో మార్పు అయితే ఉండదు. ఎప్ప‌టి నుంచో ఒక పేరు అయితే వినిపిస్తోంది క‌నుక ఆ పేరును క‌న్ఫం చేశారు. ఆ పేరు నిరంజ‌న్ రెడ్డి. ఆయ‌న జ‌గ‌న్ త‌ర‌ఫున వ్య‌క్తిగ‌త న్యాయ‌వాది. అక్ర‌మాస్తుల కేసుల‌కు సంబంధించి  ఇప్ప‌టికే సుప్రీం వాకిట వాద‌న‌లు వినిపిస్తున్న యువ న్యాయ‌వాది. ఆచార్య సినిమా నిర్మాత కూడా !

ఆచార్య సినిమా ఫ‌లితం ఆయ‌న‌కు చేదు అనుభ‌వం మిగిల్చినా ఆయ‌న కోరుకున్న విధంగా అనూహ్య ఫ‌లితం అయితే అందుకున్నారు. ఆ విధంగా ఆయ‌న పుట్టి పెరిగిన నిర్మ‌ల్ ప్రాంతానికి కూడా ఈ ఎంపిక ఓ విధంగా గ‌ర్వ‌కార‌ణమే ! ఆంధ్రా నియామ‌కాల్లో తెలంగాణ ప్ర‌తినిధుల చొర‌బాటు అన్న‌ది త‌ప్పు అని అది పార్టీకి క్షేమ‌దాయకం కాద‌ని ఇంకొంద‌రు అంటున్నారు.కానీ జ‌గ‌న్ మాత్రం ఎవ్వ‌రి మాట వినేలా లేరు. ఈ నిర్ణ‌య‌మే కాదు ఏ నిర్ణ‌యం అయినా ఏక ప‌క్ష‌మే !

మ‌రో తెలంగాణ వ్య‌క్తి, వికారాబాద్ కు చెందిన ఆర్.కృష్ణ‌య్య‌కు బీసీ నేత‌గా పేరుంది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌లో ఆయ‌న‌కు ఓ విధంగా ప్ర‌త్యేకించిన వ‌ర్గం  ఉంది. అనూహ్యంగా ఈ పేరు తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి విమ‌ర్శ‌లు రేగాయి. అస‌లు ఆర్.కృష్ణ‌య్య‌కు కానీ నిరంజ‌న్ రెడ్డికి కానీ పార్టీ స‌భ్య‌త్వ‌మే లేదు. లేనివారికి , ఇంత‌వ‌ర‌కూ పార్టీ గురించి ఏమీ మాట్లాడ‌ని వారికి, పక్కా ప్రాంతేత‌రుల‌కు ఏ విధంగా ప‌ద‌వులు ఇస్తార‌ని ఓ అసంతృప్త వాదం వినిపిస్తున్నా.. ముందు ప్ర‌స్తావించిన విధంగా ఆయ‌న నిర్ణ‌యం ఇప్పుడూ ఎప్పుడూ ఏక ప‌క్ష‌మే ! కొన్ని సార్లు అంగీకారం కాకున్నా క‌ఠినాత్మ‌క‌మే!

వీళ్లిద్ద‌రితో పాటు సాయి రెడ్డి ని ఎంపిక చేశారు. రెండోసారి సాయిరెడ్డి ఢిల్లీ వేదిక‌ల్లో  క‌నిపించ‌నున్నారు. మ‌రో వ్య‌క్తి పారిశ్రామిక వేత్త బీద మ‌స్తాన్ రావు. ఈయ‌న ఎంపిక కూడా అనూహ్యం ఏమీ కాదు. ముందునుంచి ఊహించిందే ! ఆ విధంగా ఇద్ద‌రు నెల్లూరోళ్లు పెద్ద‌ల స‌భ‌కు వెళ్ల‌నుండ‌డం కూడా ఖాయ‌మే ! రాజ్య‌సభ ఎన్నిక‌లు వ‌చ్చే నెల జ‌ర‌గ‌నున్నా దృష్ట్యా షెడ్యూల్ కూడా విడుద‌లయింది. జూన్ 10న జ‌రిగే ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థుల గెలుపు లాంఛ‌న‌మే !
– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి 

Read more RELATED
Recommended to you

Latest news