బీఎస్పీతో చిక్కులు..ఊహించని ట్విస్ట్ తప్పదా?

మునుగోడు ఉపఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది..మరికొన్ని గంటల్లో ఎన్నిక మొదలుకానుంది..మరి ఈలోపు ఎలాంటి రాజకీయం నడుస్తుందో చెప్పలేం..ఓటర్లని ఆకర్షించడానికి పార్టీలు ఇప్పటికే వారి ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే మునుగోడులో దాదాపు 40 మందిపైనే అభ్యర్ధులు పోటీ పడుతున్నారు..కానీ అసలు పోటీ టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య జరగనుంది. మెజారిటీ సర్వేల్లో టీఆర్ఎస్ పార్టీకే ఎడ్జ్ ఉందని తేలింది.

అలాగే కొన్ని సర్వేల్లో సెకండ్ ప్లేస్ కాంగ్రెస్, మరికొన్ని సర్వేల్లో బీజేపీ ఉంది. మరి ఏది నిజమవుతుందో చూడాలి..ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుటారో 6వ తేదీ వరకు వేచి చూడాలి. కాకపోతే ఇక్కడ ప్రధాన పార్టీలకు ఇబ్బంది కరమైన పరిస్తితులు ఉన్నాయి. కొందరు ఇండిపెండెంట్లు ఓట్లు చీల్చి నష్టం చేసేలా ఉన్నారు. కొన్ని గుర్తులు వల్ల టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరగవచ్చని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కొన్ని చిన్న చిన్న పార్టీల వల్ల డ్యామేజ్ తప్పదని మొదట నుంచి ప్రచారం ఉంది.

ముఖ్యంగా బీఎస్పీ విషయంలో పెద్ద ట్విస్ట్ వచ్చేలా ఉంది. మూడు ప్రధాన పార్టీల తర్వాత..ఆ పార్టీకే ఎక్కువ ఓట్లు పడేలా ఉన్నాయి. దాదాపు 4-5 శాతం ఓట్లు బీఎస్పీకు పడతాయని..దాదాపు అన్నీ సర్వేల్లో తేలింది. ప్రస్తుతం మునుగోడులో గెలవడానికి ఒక ఓటు కూడా ముఖ్యమే. అలాంటప్పుడు బీఎస్పీ ఎక్కువగానే ఓట్లు తెచ్చుకుని, ప్రధాన పార్టీలకు నష్టం చేసేలా ఉంది.

పైగా మూడు ప్రధాన పార్టీలు రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్ధులని పెడితే..బీఎస్పీ బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇచ్చింది. మునుగోడులో బీసీ వర్గం ఓట్లే సగంపైనే ఉన్నాయి. వారే గెలుపోటములని డిసైడ్ చేస్తారు. మరి ఈ బీసీ అభ్యర్ధి ఓట్లు ఎక్కువగానే చీల్చేలా ఉన్నారు. అటు బీఎస్పీకి ఎస్సీ, ఎస్టీ ఓట్లలో బలం ఉంది. మరి వారి ఓట్లు కూడా లాగేలా ఉన్నారు. మొత్తానికి బీఎస్పీతో పెద్ద ట్విస్ట్ వచ్చేలా ఉంది. ఆ పార్టీ ఎన్ని ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటే..అంతగా గెలుపోటములు మారిపోవచ్చు. చూడాలి మరి బీఎస్పీ ప్రభావం ఎలా ఉంటుందో.

ReplyForward