కమలంలో ఈటల సౌండ్ ఆఫ్..ఎక్కడో తేడా కొట్టేస్తుందే..!

-

మొన్నటివరకు తెలంగాణలో బి‌జే‌పి రాజకీయమే వేరు..ఆ పార్టీ నేతల దూకుడు మామూలుగా ఉండేది కాదు..కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ప్రజా సమస్యలపై దూకుడుగా స్పందించేవారు. ఏ విషయంలోనూ తగ్గేవారు కాదు..బి‌ఆర్‌ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా బి‌జే‌పి నేతలు రాజకీయం చేసేవారు. అలాంటిది ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎప్పుడైతే కాంగ్రెస్ రేసులోకి వచ్చిందో,. అప్పటినుంచి బి‌జే‌పి వెనక్కి తగ్గింది.

అసలు బి‌జే‌పిలోకి వలసలు కూడా ఆగిపోయాయి. పార్టీ కార్యక్రమాలు అనుకున్న మేర జరగడం లేదు. కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ తప్ప మరొకరు ఫైర్ అవుతున్నట్లు కనిపించడం లేదు. ఇదే క్రమంలో మొన్నటివరకు పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ..ఓ వైపు కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే..మరోవైపు ఇతర పార్టీల నేతలని బి‌జే‌పిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు  చేస్తూ వచ్చిన ఈటల రాజేందర్ సడన్ గా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నట్లు కనిపించడం లేదు.

ఈ మధ్య పొంగులేటి ఎపిసోడ్ తో ఈటల సౌండ్ ఆఫ్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులని బి‌జే‌పిలోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు..వారితో పలుమార్లు భేటీ అయ్యారు. అయినా వారు రాలేదు..పైగా ఈటల మనసు మార్చే ప్రయత్నం చేశారట. ఆ విషయం ఈటల స్వయంగా చెప్పారు. ఆ తర్వాత అసోం సి‌ఎంని కలిసొచ్చారు. అక్కడ నుంచి ఈటల సైలెంట్ అయ్యారు. పార్టీలో కనబడటం లేదు.

ఈయనతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వారు సైలెంట్ అయ్యారు. మరి ఎందుకు సైలెంట్ అయ్యారో క్లారిటీ లేదు..కానీ వీరు సైలెంట్ అవ్వడం వెనుక పలు అనుమానాలు వస్తున్నాయి. పార్టీలో విభేదాలు వల్ల సైలెంట్ గా ఉన్నారా? లేదా వేరే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అనే అనుమానాలు వస్తున్నాయి. చూడాలి ఈటల ఎప్పుడు యాక్టివ్ అవుతారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version