అందరి పొలిటికల్ అజెండా యూసీసీ

-

లోక్ సభ ఎన్నికల సమయంలో ఏదో ఒక కీలక అంశాన్ని తీసుకొస్తున్న బీజేపీ ,ఆ అంశంపై దేశవ్యాప్తంగా చర్చలు లెవనెత్తి ఆ పాయింట్ ఆధారంగా జనాల ఓట్లను సొంతం చేసుకుంటోంది. గత ఎన్నికల్లో ఆర్టికల్ 370ని ప్రధానంగా ప్రస్తావించిన బీజేపీ ఈసారి కూడా మరో అంశాన్ని అస్త్రంగా మార్చుకుండి.యూనిఫామ్ సివిల్ కోడ్ ను ఈసారి ప్రయోగాత్మకంగా తెరపైకి తెచ్చింది. ఇటీవల యూసీసీ పై ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇది దేశానికి అవసరమని కీలక ప్రకటన చేశారు.ఈ అంశాన్ని మిగతా పొలిటికల్ పార్టీల అజెండాగా మార్చడంలో ఈసారి కూడా మోడీ విజయం సాధించారు. ఇప్పుడు విపక్ష పార్టీలన్నీ దీనికి గట్టి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. ప్రతిపక్ష ఐక్యత కోసం సిమ్లాలో జరగనున్న రెండో సాధారణ సమావేశంలో సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించనున్నారు.అందులో కీలక అంశంగా యూనిఫాం సివిల్ కోడ్ మారింది.ఆమ్ ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు ప్రకటించి తప్పుకుంది. దాదాపు చాలా ప్రతిపక్ష పార్టీలు ఏకరూప పౌర కోడ్ ను చొరవతో ముందుకు తీసుకెళ్లడంలో మోడీ ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి.

యుసిసిపై ఇదివరకే మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దీనిని బలవంతంగా ప్రజలపై రుద్దడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. యూనిఫాం సివిల్ కోడ్‌పై భోపాల్‌లో ప్రధాని స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత.. ఈ అంశంపై కౌంటర్ ఇవ్వడానికి ప్రతిపక్ష శిబిరంలో చర్చలు మొదలయ్యాయి.ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ తరపున ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ యూసీసీపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వాస్తవ సమస్యల నుండి ప్రజల దృష్టిని బీజేపీ మళ్లించిందని ఆరోపించారు.

డిఎంకె, జెడియు, తృణమూల్ కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు యుసిసి పై వారి స్టాండ్ ని ఇప్పటికే స్పష్టం చేశాయి. అటువంటి పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీలు ఒకే స్వరంతో మరింత అప్రమత్తతతో ఉమ్మడి వ్యూహంతో ప్రతిస్పందించవలసి ఉంటుంది. తద్వారా యూనిఫాం సివిల్ కోడ్ యొక్క రాజకీయ రచ్చను మతానికి ముడిపెట్టి తారాస్థాయికి తీసుకెళ్లే బిజెపి దూకుడును అడ్డుకోవచ్చు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్ శాసనపరమైన చొరవను ప్రారంభించే అవకాశం ప్రతిపక్షాలకు కనిపించనప్పటికీ, పార్లమెంటు వెలుపల మరియు లోపల ఈ అంశంపై ఐక్య వ్యూహాన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version