రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్..త్వరలోనే కొత్త కార్డులు..

-

రేషన్ కార్డులు ఉన్న కూడా అవి కేవలం పేరుకు మాత్రమే అన్నట్లు ఉన్నాయి..అర్హత ఉన్న వారికి కూడా కార్దులను తొలగించారు.ఇప్పటికే అర్హులైన చాలా మంది కార్డులను సర్కార్ తొలగించింది.రాష్ట్ర వ్యాప్థంగా ఎన్నో లక్షల కార్డులను తొలగించించింది..తెలంగాణ సర్కార్..ఈ మేరకు షెడ్యూలును ప్రకటించి జూలై 5 నుంచి పునఃపరిశీలన ప్రారంభించింది. 20 నాటికి పరిశీలన ముగించి అర్హులెవరో, అనర్హులెవరో తేల్చాలని భావిస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల ప్రక్షాళన వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

దాదాపు 19 లక్షలకు పైగా రేషన్ కార్డులను ఎలాంటి విచారణ చేపట్టకుండా ఒకేసారి రద్దుచేయడంతో అర్హులకు అన్యాయం జరిగిందనే చర్చ కొన్నేళ్లుగా సాగుతోంది. ఈ విషయం పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్. గవాయ్తో కూడిన బెంచ్ ఏప్రిల్ 27న మొదటి విచారణ జరిపింది. ఇంత భారీ సంఖ్యలో రేషన్ కార్డులను రద్దు చేయడమేంటని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తీ పరిశీలన జరపకుండా కంప్యూటర్లలోని వివరాల ఆధారంగా ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది. కార్డుల రద్దుకు ఏ ప్రమాణాలు పాటించారో పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాలని, 2016 లో కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్థాయిలో పునః పరిశీలించాలని కోరింది..

ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. విమర్శలకు తావు లేకుండా పరిశీలన చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్ సీఆర్వోతో పాటు, అదనపు కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. తనిఖీల్లో తప్పులు జరిగిందని తేలితే ఫీల్డ్ వెరిఫికేషన్ అధికారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మార్గదర్శకాలు

రేషన్ కార్డులు రద్దైన లబ్ధిదారుల వివరాలను రేషన్ షాపుల నుంచి తీసుకొని నోటీసులు పంపాలి. డిలీట్ అయిన రేషన్ లబ్ధిదారుల జాబితాను అన్ని రేషన్ షాపులు, గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలి.

అర్హులుగా తేలితే కారణాలు రాసి, వివరాలను నమోదుచేసి ఈ- పీడీఎస్ అప్లికేషన్లో ఇచ్చిన లింక్లో అప్లోడ్ చేయాలి.తొలగించిన కార్డులు సరైనవే అయితే అందుకుగల కారణాలను సైతం అధికారులు నివేదికలో నమోదు చేయాల్సి ఉంటుంది.లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో సమస్యలుంటే జిల్లా పౌరసరఫరాల అధికారి దృష్టికి తీసుకురావాలి..పూర్తిగా తనిఖీలు చేసి మళ్ళీ కార్డులు జారీ చెయ్యాలని సుప్రీంకోర్టు సూచించింది…

Read more RELATED
Recommended to you

Latest news