వైసీపీలో వారసులు ఎంట్రీ..జగన్ ఛాన్స్ ఇస్తారా?

-

ఏపీలో వారసత్వ రాజకీయాలు అనేవి కామన్ గానే నడుస్తాయి…సీనియర్ నేతలు తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సక్సెస్ చేయాలని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. ఇప్పటికే చాలామంది నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు…మరికొంతమంది సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో మరికొంతమంది నేతల వారసులు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

ఇప్పటికే నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న నేతల లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది..అటు టీడీపీలో గాని, ఇటు వైసీపీలో గాని సీనియర్ నేతల వారసులు పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకే ఇప్పటినుంచే యాక్టివ్ గా రాజకీయం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ వారసుల లిస్ట్ ఎక్కువగా ఉంది..వైసీపీ తరుపున పోటీ చేసేందుకు చాలామంది వారసులు రెడీ అయ్యారు. మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం వారసులు ఎప్పటినుంచో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. నెక్స్ట్ ఎన్నికల్లో తాము పోటీ నుంచి తప్పుకుని వారసులని నిలబెట్టాలని సీనియర్లు చూస్తున్నారు.

ఇక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వారసులు సైతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు…వారు కూడా నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు. అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వారసుడు సైతం దూకుడుగా ఉన్నారు. ఇక తాజాగా నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కోసం టై చేసే వారిలో మాజీ మంత్రి పేర్ని నాని వారసుడు పేరు కూడా వినిపిస్తోంది.

ఇప్పటికే పేర్ని…నెక్స్ట్ ఎన్నికల నుంచి రాజకీయాలకు దూరమవుతానని, పార్టీ అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు. అయితే తాజాగా మచిలీపట్నంలో జరిగిన ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని…నెక్స్ట్ పేర్ని నాని వారసుడు పేర్ని కృష్ణమూర్తి పోటీకి దిగుతారని ప్రకటించేశారు. అంటే పేర్ని నాని సైడ్ అయ్యి, తన వారసుడుని పోటీలోకి దింపనున్నారు. మరి చూడాలి వారసులకు జగన్ సీట్లు ఇస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news