’దేశ్ కీ నేత కేసీఆర్’… జార్ఖండ్ లో కేసీఆర్ ప్లెక్సీల హల్చల్

-

తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం లభిస్తోంది. ఇంతకు ముందు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ తో పాటు, ఆయన లోక్ సభ నియోజకవర్గం వారణాసిలో కేసీఆర్ కు శుభాకాంక్షలు చెబుతూ… పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. కేసీఆర్ ను పొగుడుతూ.. తెలంగాణ పథకాలు గుర్తుకు వచ్చే విధంగా ఆయన అభిమానులు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. 

తాజాగా సీఎం కేసీఆర్ జార్ఖండ్ పర్యటనలో ఉన్నారు. ఆయన రాకను స్వాగతిస్తూ.. జార్ఖండ్ రాజధాని రాంచీలో పలు కూడళ్లలో కేసీఆర్ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అంటూ.. పెక్సీలపై ముద్రించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ని కలిసేందుకు ఢిల్లీ నుంచి రాంచీకి చేరుకున్నారు సీఎం కేసీఆర్. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి కేసీఆర్ నేరుగా బిర్సా ముండా చౌక్‌కు చేరుకుని అక్కడ అన్న గిరిజన ఉద్యమ నేతకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత హేమంత్ సోరెన్ ఇంటికి వెళ్లనున్నారు. దేశంలో బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ కూటమి కోసం సీఎ్ం కేసీఆర్ హేమంత్ సొరెన్ తో చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news