క్లైమాక్స్‌కు హుజూరాబాద్..ఓటుకు రేటు…బెట్టింగ్ జోరు…

-

హుజూరాబాద్ ఉపఎన్నిక క్లైమాక్స్‌కు వచ్చేసింది.. ఇంకా ఎన్నికకు సరిగా నాలుగు రోజులు కూడా లేవు. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారం ఇంకా హోరెత్తించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్…ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హుజూరాబాద్‌లో చివరి క్షణం వరకు ప్రచారం నిర్వహించడానికి సిద్ధమైపోయారు. అటు బీజేపీ నేతలు కూడా అదే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్ ప్రతి గడపని టచ్ చేశారు.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, ధర్మపురి అరవింద్, రఘనందనరావు, జితేందర్ రెడ్డి….ఇతర నేతలు హుజురాబాద్‌లోనే మకాం వేశారు. ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి మరో ఎత్తని కమలనాథులు ప్రచారం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడు దూకుడుగానే ప్రచారం చేస్తుంది. అయితే హుజూరాబాద్ కథ క్లైమాక్స్‌కు చేరడంతో ఓటర్లని ఆకర్షించేందుకు పార్టీలు సిద్ధమైపోయాయి….ఓటుకు ఎంత రేటు ఇచ్చి అయినా కొనేయాలని చూస్తున్నాయి. ఎలాగైనా గెలవాలనే కసితో పార్టీలు డబ్బులు వెదజల్లేస్తున్నాయి.

అటు హుజూరాబాద్ ఉపఎన్నికలో భారీ బెట్టింగులు కూడా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రాలో హుజూరాబాద్‌పై విపరీతమైన బెట్టింగులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆన్‌లైన్‌లో కూడా దీనిపై బెట్టింగ్‌లు నడుస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అసలు ఆంధ్రా బెట్టింగ్ రాయుళ్ళు…తెలంగాణలోని తమ బంధువులు, సన్నిహితులకు ఫోన్లు చేసి మరీ హుజూరాబాద్‌లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని తెలుసుకుని బెట్టింగులు కాసేస్తున్నారట.

ఇప్పటికే బెట్టింగులు వంద కోట్లు దాటినట్లు కథనాలు వస్తున్నాయి. మరి ఎన్నికల నాటికి ఇంకా ఎన్నిక కోట్లు నడుస్తాయి..రిజల్ట్ రోజు ఇంకా ఎంత బెట్టింగ్ నడుస్తుందో చూడాలి. ఏదేమైనా హుజూరాబాద్ ఉపఎన్నిక మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్లుగా సాగుతున్న ఈ పోరులో పైచేయి ఎవరు సాధిస్తారనే విషయంపై ఇప్పటికీ ఒక క్లారిటీ రావడం లేదు. మరి చూడాలి హుజూరాబాద్ పోరులో గెలుపు ఎవరిదో?

Read more RELATED
Recommended to you

Latest news