ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ ఎస్ పొలిటికల్ గా మరింత బలపడాలని భావిస్తోంది.. పార్టీ బేస్ ఉద్యమాలతో మైలేజ్ రాలేదని భావించిన ఆ పార్టీ నేతలు పంథా మార్చారు.. ప్రజలను కలుపుకుని పోయి ఉద్యమాలు చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.. ఈ క్రమంలో కొత్త అస్త్రంతో బిఆర్ఎస్ పోరాటాలకు సిద్దమవుతుంది.. సామాన్య జనాల ఎమెషన్స్ ద్వారా పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలని భావిస్తోంది.. దీంతో వారి చూపు హైడ్రా మీద పడింది..
తెలంగాణా రాజకీయాల్లో హైడ్రా ఎంట్రీ ఇవ్వడంతో అక్కడి పాలిటిక్స్ పూర్తిగా మారిపోయాయి.. కాంగ్రెస్ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న బిఆర్ఎస్ హైడ్రా చుట్టూ రాజకీయం చెయ్యాలని చూస్తోంది.. సామాన్య ప్రజల్లో ఉండే వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని మైలేజ్ సంపాదించాలని ఆ పార్టీ భావిస్తోంది.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా.. హైడ్రా మాత్రం కట్టడాలను కూల్చేస్తూనే ఉంది.. సామాన్య జనం రోడ్డెక్కినా.. కన్నీరు పెట్టుకున్నా.. కనికరించడం లేదు.. దీంతో బిఆర్ఎస్ అటువైపు నుంచి నరుక్కురావాలని చూస్తోంది..
తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదినెలలు కావొస్తోంది.. చెరువులు, ప్రభుత్వ స్తలాలను కాపాడాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఇప్పుడు అదే హైడ్రా కాంగ్రెస్ కు చెడ్డపేరు తీసుకొచ్చేలా ఉందనే ప్రచారం ఆ పార్టీలో జరుగుతోంది.. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చెయ్యడంలేదంటూ.. బిఆర్ఎస్ చేపట్టిన పోరాటాలకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదు.. దీంతో ఈసారి దెబ్బ గట్టిగా కొట్టాలని ఎదురుచూస్తున్న ఆ పార్టీకి.. హైడ్రా అస్త్రంలా దొరికింది..
మధ్యతరగతి ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లను హైడ్రా అన్యాయంగా కూల్చేస్తోందన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రజల్లో కలిగించడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది. అక్కడక్కడా బాధితులతో కలిసి పోరాటాలు చేస్తోంది.. దీంతో తమదెబ్బకు ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందని భావిస్తోంది గులాబీ నేతల్లో ఉంది.. ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపకుండా.. సేమ్ ఫ్లో కంటిన్యూ చేయాలని నిర్ణయించినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. ప్రజల నుంచి ఆశించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుండటంతో బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా పుల్ జోష్ లో హైడ్రాకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు.. తమకు అండగా ఉండాలంటూ బాధితులు కూడా బిఆర్ఎస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు.. దీంతో పొలిటికల్ మైలేజ్ కోసం ఆ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.. కాంగ్రెస్ ను ఇరుకున పెడుతూ.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు..