ఈటల-కోమటిరెడ్డి కమలానికి వీడ్కోలే..బిగ్ ట్విస్ట్ అక్కడే.!

-

ఈటల రాజేందర్-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై వీరిద్దరుపై ఎక్కువ చర్చ నడుస్తుంది. మొన్నటివరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి-జూపల్లి కృష్ణారావులపై చర్చ నడిచిన విషయం తెలిసిందే. వారిద్దరు ఏ పార్టీలో చేరతారనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. చివరికి ఆ ఇద్దరు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇక ఇప్పుడు ఈటల, కోమటిరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఈ ఇద్దరు బి‌జే‌పిలో కీలక నేతలుగా ఉన్నారు.

ఈ ఇద్దరు నేతలకు రాష్ట్ర రాజకీయాలపై పట్టు ఉంది..ఫాలోయింగ్ ఉంది. అయితే బి‌జే‌పిలో ఈ ఇద్దరికి పెద్దగా అనుకూలమైన పరిణామాలు కనిపించడం లేదు. పైగా బి‌జే‌పి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. ఎన్నికల్లో పోటీ ఎక్కువగా బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే జరగనుంది. అయితే వీరిద్దరి లక్ష్యం.. కే‌సి‌ఆర్‌ని ఓడించడం..బి‌జే‌పిలో ఉంటే అది జరిగేలా లేదు. పైగా బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో వీరికి పెద్దగా పొసగడం లేదని తెలుస్తుంది. బండి కూడా వారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ప్రచారం వస్తుంది. ఈ క్రమంలోనే వీరు అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ మారడం ఖాయమని ప్రచారం మొదలైంది.

పైగా వీరు బి‌జే‌పి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో వీరికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో ఈటల, కోమటిరెడ్డి ఢిల్లీకి వెళ్ళి.. అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. ఇంకా పార్టీలో కీలక అంశాల గురించి మాట్లాడారని తెలిసింది. కానీ షా నుంచి అనుకున్న విధంగా ఈటలకు, కోమటిరెడ్డికి మద్ధతు దక్కలేదని తెలిసింది.

దీంతో వారు భేటీ తర్వాత బయటకొచ్చి..ముక్తసరిగానే మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు. అయితే వీరు పార్టీ మార్పుపై ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం..బి‌జే‌పిని వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. చూడాలి మరి చివరికి ఈటల-కోమటిరెడ్డి ప్రయాణం ఎటువైపు ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news