ఫైర్ బ్రాండ్లకు పెద్ద రిస్క్..సత్తా చాటగలరా?

-

ఏపీలో అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకులకు కొదవ లేదు..జగన్‌కు అండగా ఉంటూ ప్రతిపక్ష పార్టీలని చెడామడా తిట్టే నాయకులు ఎక్కువగానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే జగన్‌ని ఒక్క మాట అంటే..పది మాటలు రివర్స్ లో అనగల సత్తా ఉన్న నేతలు ఉన్నారు. వారు జగన్‌పై ఈగ వాలనివ్వరు. అలా జగన్‌కు ఎప్పుడు అండగా ఉండే నేతలకు ఈ సారి ప్రజలు అండగా ఉంటారా? మళ్లీ వారికి గెలుపు అవకాశాలు ఉన్నాయా? అనే విషయాలని ఒక్కసారి చూస్తే..

ముందు వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా ఉన్న వారిలో కొడాలి నాని, పేర్ని నాని, రోజా, అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్..ఇలా కొందరు నేతలు ప్రధానంగా కనిపిస్తారు. ఇంకా ఫైర్ బ్రాండ్ నాయకులు ఉన్నారు గాని..వీరే మెయిన్‌గా కనిపిస్తారు.  గత ఎన్నికల్లో వీరందరూ గెలిచారు. పైగా మొదట విడతలో కొందరు మంత్రులుగా చూస్తే..ఇప్పుడు కొందరు మంత్రులుగా చేస్తున్నారు.

అయితే ఇందులో కొడాలి నాని మెయిన్ టార్గెట్ చంద్రబాబు అని చెప్పవచ్చు. ఆయన్ని ఏ స్థాయిలో తిడతారో చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈయనకు చెక్ పెట్టాలని టి‌డి‌పి నేతలు కసితో ఉన్నారు. కానీ గుడివాడలో అంత ఈజీగా కొడాలికి చెక్ పెట్టడం కష్టమని చెప్పవచ్చు. కాకపోతే టి‌డి‌పి-జనసేన కలిస్తే కాస్త గట్టి పోటీ ఇవ్వవచ్చు.

ఇటు పేర్ని నానికి టి‌డి‌పి-జనసేన కలిస్తే చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి రోజా, జోగి, అంబటి రాంబాబులకు సైతం అంతగా గెలవడానికి అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. అటు అప్పలరాజు, అమర్నాథ్‌ల పరిస్తితి అలాగే ఉందని చెబుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ పరిస్తితి కూడా ఆశాజనకంగా కనిపించడం లేదు. అంటే టి‌డి‌పి-జనసేన కలిస్తే ఒక్క కొడాలి నాని మినహా మిగిలిన నేతలు డేంజర్ జోన్ లో ఉన్నట్లే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news