టీడీపీ-జనసేన పొత్తు ఉంటే ఎక్కువ ప్రభావం చూపేది ఉభయ గోదావరి జిల్లాలే అనే సంగతి తెలిసిందే. ఆ జిల్లాల్లో పొత్తు ప్రభావం ఉంటుంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాల్లో జనసేన భారీగా ఓట్లు చీల్చి టిడిపికి డ్యామేజ్, వైసీపీకి లాభం చేసింది. కానీ ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టాలని టిడిపి-జనసేన కలుస్తున్నాయి. దీంతో గోదావరి జిల్లాల్లో వైసీపీకి చెక్ పడిపోతుందని విశ్లేషణలు వస్తున్నాయి.
కానీ పూర్తిగా అలాంటి పరిస్తితి రాకుండా జగన్ రివర్స్ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తు వికటించేలా రాజకీయ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రెండు జిల్లాల్లో టిడిపి-జనసేనలకు పోటీగా సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. అయితే గత ఎన్నికల్లో రెండు జిల్లాల్లో వైసీపీ ఆధిక్యం సాధించింది. ఉమ్మడి తూర్పులో 19 సీట్లు ఉంటే వైసీపీ 14, టిడిపి 4, జనసేన 1 సీటు గెలుచుకుంది. పశ్చిమలో 15 సీట్లు ఉంటే వైసీపీ 13, టిడిపి 2 సీట్లు గెలుచుకుంది.
మొత్తం మీద రెండు జిల్లాల్లో 34 సీట్లు ఉంటే వైసీపీ 27 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ సారి టిడిపి-జనసేన పొత్తు ఉంటే..వైసీపీ మళ్ళీ ఆ సీట్లు గెలుచుకోలేదు. ఎంత కాదు అనుకున్న రియాలిటీ చెప్పుకోవాలి. కాబట్టి ఈ సారి వైసీపీకి కాస్త బలం తగ్గవచ్చు. అదే సమయంలో టిడిపి-జనసేన పొత్తులో కొన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని సీట్లు టిడిపికి, కొన్ని సీట్లు జనసేనకు దక్కుతాయి. ఈ క్రమంలో జనసేన పోటీ చేసే సీటులో టిడిపి ఓటర్లు పూర్తిగా మద్ధతు ఇస్తారని లేదు..అలాగే టిడిపి పోటీ చేసే సీటులో జనసేన ఓటర్లు పూర్తిగా మద్ధతు ఇస్తారని లేదు.
పైగా పవన్‌కు సీఎం సీటు ఉండదు కాబట్టి..ఆయా సీట్లలో జనసేన ఓట్లని వైసీపీ వైపుకు మళ్లించుకుంటే చాలు..వైసీపీకి గెలుపు సులువు అవుతుంది. ఎలాగో పథకాల లబ్దిదారులు మెజారిటీ వైసీపీ వైపే ఉంటారు. వైసీపీని అభిమానించే వారు ఉంటారు. దీంతో గోదావరి జిల్లాల్లో వైసీపీ ఈ సారి 15-18 సీట్లు గెలుచుకున్న చాలు..ఆ పార్టీకి తిరుగుండదు. ఎలాగో రాయలసీమలో వైసీపీకి ఎదురు ఉండదు. నెల్లూరు-ప్రకాశంలో సత్తా చాటుతుంది. కాబట్టి వైసీపీకి అధికారం వచ్చేస్తుంది.