జ‌గ‌న్‌కు ఆస్కార్‌కు మించి మోస‌కార్ ఇవ్వాలి : అచ్చెన్నాయుడు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి జ‌గ‌న్.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్ర‌త్యేక హోదా ప‌క్క‌దారి ప‌ట్టించ‌డంతో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆస్కార్ కు మించి మోస‌కార్ అనే అవార్డును ఇవ్వాల‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌తి ప‌క్షంలో వైసీపీ ఉన్నప్పుడు.. పెయిడ్ ఆర్టిస్టుల‌తో ప్ర‌త్యేక హోదా అంటూ నట‌కాలు ఆడార‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌త్యేక హోదా ఊసే ఎత్త‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న కేసుల మాఫీ కోసం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్ర‌త్యేక హోదా ఆకాంక్షను తాక‌ట్టు పెట్టార‌ని మండి ప‌డ్డారు. తాడేపల్లి నుంచి ఢిల్లీ వ‌ర‌కు హోదా అనే ప‌దం కూడా విన‌ప‌డ‌కుండా బ్యాన్ చేశార‌ని విమ‌ర్శించారు. హోదా విషయంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, యువ‌తకు వైసీపీ ఆడుతున్న డ్రామాలు తెలిసిపోయాయ‌ని అన్నారు. హోదా కోసం యువ భేరీ అంటూ స‌మావేశాలు నిర్వ‌హించిన జ‌గ‌న్.. ఇప్పుడు యువ‌త కు బ‌హిరంగంగా క్షమాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్షను తీర్చ‌ని జ‌గ‌న్.. ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉండ‌టానికి అర్హ‌త లేద‌ని అన్నారు. వెంట‌నే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news