జగన్ వార్నింగ్ వర్కౌట్..మంత్రుల్లో మార్పు?

-

ఎప్పుడైతే ప్రతిపక్షాలకు విమర్శలకు ధీటుగా మంత్రులు స్పందించడం లేదని, కనీసం తన ఫ్యామిలీపై ఆరోపణలు చేసిన సరే మంత్రులు ధీటుగా కౌంటర్లు ఇవ్వడం లేదని, ఇలాగే చేస్తే కొందరు మంత్రులని తప్పించడానికి కూడా వెనుకాడనని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారో…ఆ తర్వాత నుంచే మంత్రుల్లో మార్పు వచ్చింది…వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెట్టి…చంద్రబాబు-లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ వచ్చారు.

మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, సురేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల్, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని..ఇలా వరుసపెట్టి మీడియా సమావేశాలు పెట్టి…చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అలాగే దూకుడుగా ఉంటున్న లోకేష్‌పై కూడా విరుచుకుపడ్డారు. అటు సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు…చంద్రబాబు ఫ్యామిలీని టార్గెట్ చేసి మరీ బూతులు తిడుతున్నారు. దీని బట్టి చూస్తే జగన్ వార్నింగ్ బాగానే పనిచేసిందని చెప్పొచ్చు. మంత్రి పదవి పోతుందనే భయంతోనే మరింత దూకుడుగా విమర్శలు చేసినట్లు కనిపిస్తున్నారు.

మంత్రి నాగార్జున ఓ అడుగు ముందుకేసి…లోకేష్ ఎక్కువ మాట్లాడితే నాలుక కోసేస్తామని మాట్లాడారు. అలాగే కాకాని కూడా…చంద్రబాబు గతంలో దొంగతనాలు చేసేవారని మాట్లాడారు. అంటే ఇక్కడ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. అయితే రెండు పార్టీల మధ్య వ్యక్తిగతమైన విమర్శలే నడుస్తున్నాయి. ఇలా మరీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వల్ల ఎవరికి లాభం ఉండదు…ఎందుకంటే ఇలాంటి విమర్శలని ప్రజలు నమ్మే పరిస్తితి ఉండదు. ఇటు వైసీపీనైనా, అటు టీడీపీనైనా సరే…ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే వాటినే వాస్తవాలు అని ప్రజలు నమ్మే ఛాన్స్ ఉండదు.

కానీ ఏపీలో మాత్రం ఇలాంటి రాజకీయమే నడుస్తోంది..అయితే మంత్రులు ఉన్నది తిట్టడానికేనా అని విమర్శలు వస్తున్నాయి. అసలు మంత్రులైతే ప్రెస్ మీట్లు పెట్టి తిడతారు…కానీ వారు తమ శాఖలకు సంబంధించి పెద్దగా ఏమి మాట్లాడారు..అందుకే ప్రజలకు కూడా ఏ మంత్రి ఏ శాఖ అనేది తెలియడం లేదు. మొత్తానికి వైసీపీ-టీడీపీలు ప్రజల కోసం పనిచేయడం కంటే…సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news