రాజోలు…ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఇది ఒకటి. అయితే ఈ నియోజకవర్గం ఎప్పుడు పెద్దగా హైలైట్ కాలేదు. కానీ గత ఎన్నికల్లోనే ఈ నియోజకవర్గం హైలైట్ అయింది. గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక సీటు ఇది. ఆఖరికి పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినా సరే…రాజోలులో రాపాక వరప్రసాద్ జనసేన నుంచి గెలిచి పవన్ పరువు నిలబెట్టారు. అయితే ఎక్కువ కాలం జనసేనలో ఉండలేదు. వెంటనే అధికారం కోసం వైసీపీ వైపుకు వెళ్లారు. పైగా తాను సొంత బలంతో గెలిచానని డప్పు కొట్టుకున్నారు.
ఇక ఎప్పుడైతే రాపాక వైసీపీ వైపుకు వెళ్లారో అప్పటినుంచి జనసేన శ్రేణులు బాగా కోపంతో ఉన్నాయి..ఎలాగైనా రాపాకకు చెక్ పెట్టాలని చూస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాపాకని ఓడించాలని జనసేన శ్రేణులు కసితో పనిచేస్తున్నాయి. అయితే మొన్నటివరకు రాజోలు వైసీపీ సీటు రాపాకకు దక్కుతుందా? లేదా? అని చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. కానీ ఇటీవల రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్ గా రాపాకని నియమించారు. దీని బట్టి చూస్తే రాజోలులో వైసీపీ తరుపున పోటీ చేసేది రాపాక అని తెలుస్తోంది.
అయితే వైసీపీ తరుపున నిలబడి రాపాక మళ్ళీ రాజోలులో గెలవగలుగుతారా? అంటే అబ్బే చాలా కష్టమనే చెప్పాలి. ఇప్పటికే ఆయనపై వ్యతిరేకత ఉంది. ఓ వైపు నియోజకవర్గంలోని కాపులు రాపాకకు యాంటీగా ఉన్నారు…ఇటు సొంత పార్టీకి చెందిన వైసీపీ కార్యకర్తలు కూడా రాపాకకు వ్యతిరేకంగా ఉన్నారు. రాపాక వల్ల చాలామంది వైసీపీ కార్యకర్తలు పార్టీకి దూరం జరుగుతున్నారు. దీని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో రాపాక గెలుపు అంత ఈజీ కాదు. ఆయనకు జనసేన చేతిలోనే ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఒకవేళ నెక్స్ట్ టీడీపీ-జనసేన కలిస్తే రాజోలు సీటు జనసేనకే దక్కుతుంది. అలాగే రెండు పార్టీలు కలిస్తే రాపాకకు చెక్ పడటం ఖాయం. మొత్తానికి రాపాకకు మళ్ళీ గెలిచే ఛాన్స్ కనబడటం లేదు.