మాజీ జేడీతో కే‌ఏ పాల్..పవన్‌కు ఆఫర్.!

-

ఏపీలో వింత రాజకీయాలు నడుస్తున్నాయి..ఏ పార్టీ ఎప్పుడు ఎవరికి మద్ధతు ఇస్తుందో..ఎవరెవరు కలుస్తారో అర్ధం కాకుండా ఉంది. అలాగే తెలంగాణలో అధికారంలో ఉన్న కే‌సి‌ఆర్..ఏపీ రాజకీయాలపై కూడా ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కేంద్రంలోని బి‌జే‌పిని టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇక  ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్‌ని కేంద్రం ప్రైవేటీకరించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

దీన్ని అడ్డుకుని ఏపీలో రాజకీయంగా ఎదగాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. అటు కే‌సి‌ఆర్ రాజకీయాలకు చెక్ పెట్టాలని జగన్ చూస్తున్నారు. ఇలా ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు. ఈ క్రమంలో సి‌బి‌ఐ మాజీ జే‌డి లక్ష్మీనారాయణ సైతం స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని చెబుతున్న జే‌డి..స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన..ప్రజాశాంతి అధ్యక్షుడు కే‌ఏ పాల్‌ని కలవడం విశేషం.

ఆయనతో కలిసి తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా పాల్..తన ఆస్తులు అమ్మైనా సరే స్టీల్ ప్లాంట్‌ని కాపాడుకుంటానని అన్నారు. మోదీ, అమిత్ షాలు..దేశాన్ని అదాని, అంబానీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.  స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం ఆపాలని రెండేళ్ల క్రితమే లేఖ రాశానట్లు చెప్పిన పాల్.. అమెరికన్ ఫండ్‌ను నేరుగా అనుమతిస్తే.. కేంద్ర ప్రభుత్వానికి తానే ఫండ్ ఇస్తానని… స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకుంటామని అన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రామాలు ఎవరు నమ్మొద్దని..తెలంగాణను కాపాడలేని కే‌సి‌ఆర్..స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతారా? అని ఫైర్ అయ్యారు. అలాగే తమ్ముడు పవన్ కళ్యాణ్  బీజేపీ వదిలి బయటకురావాలని,  పవన్ కళ్యాణ్ పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని కోరారు. మొత్తానికి కే‌ఏ పాల్, మాజీ జే‌డి కలవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news