హుజూరాబాద్ బరిలో కౌశిక్ రెడ్డి..ఈటలతో కష్టమేనా?

-

తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి అందరికీ తెలిసిందే. 2021లో జరిగిన ఈ ఉపఎన్నిక ఏ స్థాయిలో జరిగిందో తెలిసిందే. రెండు దశాబ్దాల పాటు బి‌ఆర్‌ఎస్ పార్టీలో పనిచేసి…కే‌సి‌ఆర్ రైట్ హ్యాండ్ మాదిరిగా పనిచేసిన ఈటల రాజేందర్…బి‌ఆర్‌ఎస్ లో అనుమానాలు భరించలేక బి‌జే‌పిలో చేరారు. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

ఈ క్రమంలో హుజూరాబాద్ ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికలో ఈటలని ఓడించడానికి బి‌ఆర్‌ఎస్ వేయని ఎత్తులు లేవు. కానీ ఎన్ని చేసిన చివరికి ఈటల గెలిచారు.అలా ఈటల అడ్డాగా ఉన్న హుజూరాబాద్‌ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని బి‌ఆర్‌ఎస్ చూస్తుంది. వచ్చే ఎన్నికల్లోనైనా ఈటలని ఓడించాలని చెప్పి బి‌ఆర్‌ఎస్ ట్రై చేస్తుంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో హుజూరాబాద్ సీటులో కౌశిక్ రెడ్డిని నిలబెట్టడానికి బి‌ఆర్‌ఎస్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే హుజూరాబాద్ బరిలో కౌశిక్ రెడ్డిని నిలబడతారని కే‌టి‌ఆర్ ప్రకటించారు. కే‌సి‌ఆర్ ఆశీర్వాదంతో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అవుతారని మంత్రి గంగుల కమలాకర్ చెప్పుకొచ్చారు.

అంటే వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేయడం ఖాయమైందని చెప్పవచ్చు. మరి ఈటల అడ్డాగా ఉన్న హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి ఏ మేరకు సత్తా చాటుతారనేది క్లారిటీ లేదు. అక్కడ ఈటలకు సొంత బలం ఎక్కువ. కౌశిక్ రెడ్డికి కూడా ఫాలోయింగ్ ఉంది గాని..ఆ ఫాలోయింగ్ ఎంత మేర గెలుపుకు సహకరిస్తుందో తెలియని పరిస్తితి.

పైగా బి‌ఆర్‌ఎస్ శ్రేణులు ఈటలకు సపోర్ట్ చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి బలం కనిపించడం లేదు. ఈ పరిస్తితుల్లో ఈటలని నిలువరించడం కౌశిక్ రెడ్డికి సాధ్యమవుతుందో లేదో తెలియని పరిస్తితి. చూడాలి మరి ఈ సారి హుజూరాబాద్ పోరు ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news