తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ పర్యటన క్యాన్సిల్ అయింది. సీఎం కేసీఆర్ ఇవాళ అమరావతితో పాటు వైజాగ్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ.. అమరావతిలో నిర్మించిన జగన్ గృహ ప్రవేశ కార్యక్రమం వాయిదా పడింది. జగన్ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని.. అక్కడి నుంచి వైజాగ్‌లోని శారదా పీఠాన్ని సందర్శించాలని సీఎం కేసీఆర్ అనుకున్నారు. శారదా పీఠంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఇవాళ జరగనుంది. రెండు పనులు కలిసి వస్తాయని కేసీఆర్ అనుకున్నారు కానీ.. జగన్ గృహ ప్రవేశం వాయిదా పడటంతో.. ఏపీ పర్యటననే రద్దు చేసుకున్నారు. స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో జరగబోయే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ బదులుగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెళ్లనున్నారు.
అయితే.. జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల అనారోగ్యం కారణంగానే జగన్ గృహ ప్రవేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని తాడేపల్లిలో జగన్ కొత్త ఇంటిని నిర్మించారు.