‘కారు’లో ట్విస్ట్‌లు ఇస్తున్న సారు…?

-

కేసీఆర్ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తూనే ఉన్నారు…దూసుకొస్తున్న ప్రతిపక్షాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మళ్ళీ మూడోసారి అధికారం దక్కించుకోవడానికి ఆయన వేయని వ్యూహం లేదు. ఇప్పటికే ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్‌…టీఆర్ఎస్ టార్గెట్‌గా దూసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీపై కేసీఆర్ మళ్ళీ ఫోకస్ పెట్టారు. రాజకీయంగా ఆ రెండు పార్టీలని ఎదుర్కోవడమే కాకుండా…స్థానికంగా డెబ్బకొట్టడానికి కేసీఆర్ స్కెచ్‌లు వేస్తున్నారు.

అయితే తెలంగాణ వచ్చాక ఇంతవరకు పూర్తి స్థాయిలో జిల్లా అధ్యక్షులని ఎప్పుడు పెట్టలేదు. కానీ ఇప్పుడే ఫస్ట్ టైమ్…33 జిల్లాల అధ్యక్షులని నియమించారు. తెలంగాణ రాక ముందు టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారు… 2015 వరకు ఆ పదవుల్లో కొనసాగారు. ఆ తర్వాత పార్టీ అధిష్ఠానం జిల్లా అధ్యక్ష వ్యవస్థను రద్దు చేసింది. ఆ స్థానంలో జిల్లాకు ఇద్దరు చొప్పున కో-ఆర్డినేటర్లు లేదా జిల్లాకు ఒకరి వంతున కన్వీనర్ల నియామకం చేపట్టాలని భావించింది….కానీ అది కార్యరూపం దాల్చలేదు…ఇక ఇప్పుడు మళ్ళీ అధ్యక్ష వ్యవస్థని తీసుకొచ్చింది.

ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..ఎవరైతే మంత్రివర్గంలోకి రావడానికి ట్రై చేస్తున్నారో వారిలో చాలామందిని జిల్లా అధ్యక్షులుగా పెట్టారు. మొత్తం 33 మంది జిల్లా అధ్యక్షుల్లో 20 మంది ఎమ్మెల్యేలు, మిగిలిన 13 మందిలో ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. జడ్పీ చైర్‌పర్సన్లు ముగ్గురు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు ఇద్దరు, ఇతర హోదాల్లో ఉన్న వారు ముగ్గురు ఉన్నారు.

అంటే 20 మంది ఎమ్మెల్యేలని, ఇద్దరు ఎమ్మెల్సీలని జిల్లా అధ్యక్షులుగా పెట్టేశారు. ఎమ్మెల్యేల్లో జోగు రామన్న, కోనేరు కొనప్ప, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, ఆరూరి రమేష్, గువ్వల బాలరాజు, దాస్యం వినయ్ భాస్కర్ లాంటి వారు మంత్రి పదవులు ఆశించే లిస్ట్‌లో ఉన్నారు. అలాంటప్పుడు వీరిని జిల్లా అధ్యక్షులుగా పెట్టారు. మరి దీని బట్టి చూస్తే వీరికి మంత్రి పదవులు ఇవ్వడం జరగదా? అనేది డౌట్ వస్తుంది. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం జిల్లాల వారీగా వీరు కష్టపడనున్నారు. అయితే మధ్యలో ట్విస్ట్ ఏమన్నా ఇస్తూ..వీరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news