కేసీఆర్‌ వర్సెస్ జగన్‌: ఇరుక్కున్నది ఎవరు?

-

మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. సడన్‌గా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు మాటల దాడి చేశాయి. అసలు మొదట నుంచి ఏ రచ్చ లేపిన టీఆర్ఎస్ మాత్రమే లేపుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కూడా అదే పనిచేసింది… సంబంధం లేకుండా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని లాగింది. తాజాగా టీఆర్ఎస్… కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ…. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసిన విషయం తెలిసిందే.

kcr-jagan
kcr-jagan

ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. సరే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేసిన టీఆర్ఎస్ నేతలు… మధ్యలో ఏపీ ప్రభుత్వాన్ని లాగారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి అనూహ్యంగా జగన్ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడి ప్రజలు అడుక్కు తింటారని అప్పటి మంత్రులు, నేతలు అన్నారని, ప్రస్తుతం ఏపీలో అదే పరిస్థితి ఏర్పడిందని, నిధులకోసం ఆ రాష్ట్ర సీఎం జగన్‌.. కేంద్రం వద్ద అడుక్కునే పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం నడవాలంటే కేంద్రం నిధులు కావాలని మాట్లాడారు.

అసలు ఏపీపై కామెంట్లు చేయాల్సిన సమయం ఇది కాదు…కానీ టీఆర్ఎస్‌ని హైలైట్ చేసుకోవడానికి జగన్‌ని టార్గెట్ చేశారు. కానీ ఇక్కడే దెబ్బతిన్నారు. వెంటనే టీఆర్ఎస్‌కు వైసీపీ నుంచి కౌంటర్లు వచ్చేశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాదిరిగా బయట కాలరెగరేసి.. లోపల కాళ్లు పట్టుకోవడం తమ సీఎంకి తెలియదని, జగన్‌ ఎప్పుడూ ఒకే విధానంతో ముందుకెళ్తున్నారని, కేసీఆర్‌ తరచుగా కేంద్రం వద్దకు వెళ్తున్నారని, నిధులిస్తే కేంద్రంలో చేరుతామని చెబుతున్నారని, అలాగే తెలంగాణ ఇప్పటివరకు ఎంత అప్పు చేసిందో తెలుసని ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.

అంటే ఇక్కడ అనవసరంగా టీఆర్ఎస్ సర్కార్..వైసీపీ సర్కార్‌ని కెలికి ఇరుక్కుందనే చెప్పాలి. కేసీఆర్ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారో అందరికీ తెలుసు…అప్పుడు ఈ పోరాటాలు ఏమయ్యాయో తెలియదు…పైగా అక్కడ కాళ్ళు పట్టుకుంటున్నారని ఏపీ మంత్రి సెటైర్లు వేస్తున్నారు. కేంద్రంలో చేరడానికి చూస్తున్నారని కేసీఆర్‌ని బుక్ చేశారు. మొత్తానికి టీఆర్ఎస్ బుక్ అయినట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news